మట్టి గణపతి విగ్రహాలనే పూజించాలి :రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు

పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మట్టి గణపతులను ప్రతిష్టించి ఆరాధించాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు పిలుపునిచ్చారు.

బుధవారం సిద్దిపేట పట్టణంలో
బిసి సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో
శ్రీ వెంకటేశ్వర దేవాలయం వద్ద ,
36 వ వార్డు కౌన్సిలర్ ఉదర విజయ ఆధ్వర్యంలో రామరాజు రావి చెట్టు హనుమాన్ దేవాలయంలో మట్టి విగ్రహల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు పాల్గొన్నారు.

ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ…
రసాయనాలు, రంగులు లేని మట్టి వినాయకులను పూజించి పర్యావరణ కాలుష్యాన్ని నివారించేందుకు ప్రజలు సహకరించాలని మంత్రి కోరారు.
ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారీ్‌సతో చేసిన విగ్రహాలతో పర్యావరణానికి హాని కలిగే ప్రమాదం ఉందన్నారు. ముఖ్యంగా జల చరాలు ప్రమాదంలో పడే ప్రమాదం ఉందన్నారు.

ఎంత పెద్ద, రంగు రంగుల వినాయకుడి విగ్రహాన్ని పెట్టామన్నది ముఖ్యం కాదని, ఎంత భక్తి శ్రద్ధలతో భగవంతుణ్ణి పూజించామన్నది ముఖ్యమని మంత్రి తెలిపారు. భక్తి భావం నింపుకొని, నియమ నిష్ఠలతో పూజలు చేస్తే కుటుంబ సభ్యులకు మంచి జరుగుతుందన్నారు.

గత పది సంవత్సరాల నుంచి సిద్దిపేట లో మట్టి గణపతి లను ప్రాచుర్యంలోకి తీసుకు వచ్చామని మంత్రి పేర్కొన్నారు. సిద్దిపేట ధార్మిక సంస్థ, వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ, అమరనాథ్ అన్నదాన సేవా సమితి , పలువురు కౌన్సిలర్స్ వారి వార్డులలో పర్యావరణ హిత మట్టి గణపతులను పంపిణీ చేయడం అభినందనీయం అన్నారు.
ఇప్పటికే పట్టణంలో చాలా చోట్ల ఈ విగ్రహాల పంపిణీ జరుగుతోందన్నారు.
రద్దీ ప్రదేశాలు, ప్రధాన కూడళ్లు, పర్యాటక ప్రదేశాలు ఇలా జనసమూహాలు ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో మట్టి విగ్రహాలు పంపిణీ చేస్తున్నారనీ అన్నారు.

మట్టి విగ్రహాల తో పర్యావరణ పరిరక్షణతోపాటు కులవృత్తిపై ఆధారపడిన కుమ్మరులకు ఆర్థికంగా తోడ్పాటు అందించినవారమవుతామన్నారు.
గ్రామాల్లో కూడ మట్టి గణపతలను ప్రతిష్టించాలనీ మంత్రి కోరారు.గ్రామాల్లో, వార్డులో ఒక్క వినాయకున్ని ప్రతిష్ఠిoచి…ఐక్యత చాటి చెపుదామని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు.

ప్రస్తుత కోవిడ్‌ పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వ సూచనలను పాటిస్తూ వినాయక ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని మంత్రి సూచించారు.

కార్యక్రమంలో జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ, మున్సిపల్ చైర్మన్ మంజుల రాజనర్సు , జిల్లా అదనపు కలెక్టర్ ముజామిల్ ఖాన్, శిక్షణ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ , జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారిణి సరోజ, కౌన్సిలర్స్ పాల్గొన్నారు.

——————————
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, సిద్దిపేట చే జారీ చేయనైనది

Share This Post