మణుగూరులో బాలల సంరక్షణ కేంద్రానికి 15 రోజుల్లో అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ అనురేష్ సంక్షేమ అధికారులకు సూచించారు

. సోమవారం కలెక్టరేట్ సమావేశు హాలులో బాల సంరక్షణ కేంద్రంలో ఏర్పాటు అంగన్వాడీ కేంద్రాలు తనిఖీ నివేదికలు, యం అంగన్వాడీ యాస్లో సిడిపిఓలు, సూపర్జర్లు ఆన్లైన్ హాజరు శాతం, పౌష్టికాహారం, భద్రాచలం శిశు గృహం చిన్నారుల దత్తత కార్యక్రమాలు, కోవిల్ వ్యాప్తి, వ్యాక్సినేషన్, తహసీల్దార్, యంపడికి, కార్యాలయాల్లో బయో మెట్రిక్ హాజరు అమలు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మణుగూరులో ఏర్పాటు చేయనున్న బాలల సంరక్షణ కేంద్రంలో చిన్నారులు ఆటలు ఆడుకోవడానికి వీలుగా పరిల్, వాలీబాల్ కోర్టులు ఏర్పాటు చేయాలని చెప్పారు. అలాగే గ్రంధాలయం కూడా ఏర్పాటు చేయాలని చెప్పారు. విద్యార్థులకు క్రీడా సామగ్రిని అందుబాటులో ఉండాలని చెప్పారు. పరిసరాలను పరిశుభ్రం చేసింది. వివిధ రకాల మొక్కలతో కేంద్రాన్ని ముస్తాబు చేయించాలని మున్సిపల్ కమిషనర్కు సూచించారు. గత సంవత్సరం సెప్టెంబర్ 28వ తేదీన భద్రాచలంలో శిశుగృహాం ప్రారంభించామని నాటి నుండి నేటి వరకు ఏడుగురు చిన్నారులను కారా నియమనిబంధనల మేరకు దత్తత ఇవ్వడం జరిగిందని చెప్పారు. ఈ కేంద్రంలో ఇంకనూ ముగ్గురు చిన్నారులున్నారని చెప్పారు. పోషణలోపం ఉన్న చిన్నారుల గురించి ప్రస్తావిస్తూ సిడిపిఓలు, సూపర్వైజర్లు నిర్లక్ష్యం వల్ల చిన్నారులు పోషణ లోపంతో బాధపడుతున్నారని, అంగన్వాడీలను తనిఖీ చేయకుండా నిర్లక్ష్యం వహించే సిబ్బందిని విధుల నుండి తొలగిస్తామని చెప్పారు. అంగన్వాడీ కేంద్రాలపై సిడిపిటలు, సూపర్ వైజర్ల పర్యవేక్షణ కొరవడిందని నెలలో తప్పని సరిగా 20 రోజులు కేంద్రాలను తనిఖీ చేయాల్సి ఉన్నట్లు ఆయన వివరించారు. గత ఆరు నెలల కాలం నుండి యం అంగన్వాడీ యాప్ ద్వారా సిడిపిఓలు, సూపర్వైజర్లు అంగన్వాడీ కేంద్రాలు తనిఖీ నివేదికలు మంగళవారం వరకు అందచేయాలని చెప్పారు. కరోనావ్యాధి వ్యాప్తి జరుగుతున్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. ఏ మాత్రం. వ్యాధి లక్షణాలున్న భాష్యం చేయక తక్షణమే చికిత్సలు ప్రారంభించాలని చెప్పారు. వైద్య సిబ్బంది ఇంటింటి తనిఖీలో కిట్లు అందచేస్తున్నారని క్రమం తప్పక వాడటం వల్ల వ్యాధి తగ్గిపోంతుందని చెప్పారు. వ్యాక్సినేషన్ కార్యక్రమం. అనుకున్న మేర జరగడం లేదని, వేగం పెంచాలని చెప్పారు. సిబ్బందికి, కుటుంబ సభ్యులకు వ్యాధి సోకుతుందని. వ్యాధి నియంత్రణకు తప్పనిసరిగా మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించాలని ఆయన సూచించారు. ఎంపిడిఒ తహసిల్దార్ కార్యాలయాల సిబ్బంది సమయ పాలన పాటించాలని చెప్పారు. రానున్న సోమవారం నుండి అన్ని తహసిల్దార్, యంపిడిఓ కార్యాలయాల్లో బయో మెట్రిక్ హాజరు విదానం అమలు చేయు విధంగా చర్యలు తీసుకోవాలని డీఆర్డకు సూచించారు. యంపిడిఓలు, తహసిల్దారులు కార్యస్థానాల్లోనే ఉండాలని, రాకపోకలు చేసే వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ సమావేశంలో డిఆర్డీఓ అశోక్ చక్రవర్తి, సంక్షేమ అధికారి వరలక్ష్మి, వైద్యాధికారి డాక్టర్ శీరీష, ఆర్డీఓ స్వర్ణలత, మణుగూరు మున్సిపల్ కమిషనర్ నాగప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

 

Share This Post