మత్తు పదార్దాల పై అవగాహన సదస్సు

ఈ రోజు రాష్ట్ర బాలల హక్కుల రక్షణ కమిషన్ స్టేట్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ అఫ్ చైల్డ్ రైట్స్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ అధికారుల సమీక్షా సమావేశం నిర్వహించారు, ఈ సమావేశానికి ముఖ్య అతిధి గా రాష్ట్ర బాలల హక్కుల రక్షణ కమిషన్ చైర్ పర్సన్ జె. శ్రీనివాస్ రావు గారు మత్తు పదార్దాల పై అవగాహన మరియు దుష్పరిణామాలు గురించి, మత్తు పదార్దాల వినియోగం ద్వారా పిల్లల పై చేదు ప్రభావం, చట్టాల పై అవగాహన గూర్చి వివరించడం జరిగింది. అదేవిదంగా రాచకొండ పోలీస్ కమీషనర్ మహేష్ భగవత్ మాట్లాడుతూ మత్తు పదార్దాల వల్ల పిల్లల్లో సరిగా విద్య మానసిక రుగ్మతకు గురికాకుండా పిల్లలను సక్రమమైన మార్గంలో నడవవలసి విషయాల పై అవగాహనా  కల్పించడం జరిగింది. ఇదే విషయం పై కమిషన్ సభ్యుడు దేవయ్య, కమిషన్ సభ్యురాలు అపర్ణ, సిటీ సివిల్ కోర్ట్ సెక్రటరీ మురళి మోహన్ చౌహన్, రాధికా జైస్వాల్, అడిషనల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, డి సి పి బారి, డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ అక్కేశ్వర్ రావు, డిఈ ఓ రోహిణి, వివిధ శాఖల అధికారులు, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ టీం వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

????????????????????????????????????

Share This Post