ఈ నెలనుండి మత్స్యకారులకు, పాడి రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులు అందించుటకు స్పెషల్ డ్రైవ్ చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ బి గోపి తెలిపారు.
శుక్రవారం జిల్లా బ్యాంకర్ల కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్ లో జరిగింది.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వరంగల్ జిల్లా అవతరించిన తర్వాత 113 బ్రాంచ్ లు,31 బ్యాంకులతో లీడ్ బ్యాంకు ద్వారా జిల్లా క్రెడిట్ ప్లాన్ అమలు అవుతున్నట్లు తెలిపారు.
జూన్ క్వార్టర్లో క్రాప్ లోన్ 1316.60 కోట్లకు గాను 844.24 కోట్ల రూపాయలు పంట రుణాలు అందించామన్నారు.
పరిశ్రమలకు 493.38 కోట్లకు గాను140.03 కోట్ల రుణాలు ప్రాధాన్యతా రంగాలకు 2446.66 కోట్లకు గాను 1238.13 కోట్ల లక్ష్యాలను పూర్తి చేశామన్నారు.
పాడి రైతులకు పెండింగ్లో ఉన్న 1348 కిసాన్ క్రెడిట్ కార్డులు, 7 0 2 5 దు మంది మత్స్యకారులకు వెంటనే కిసాన్ క్రెడిట్ కార్డు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ మరియు ఎమ్మెల్యే కోరారు.
అలాగే 9 మండలాలకు కలిపి మూడో ఆర్థిక అక్షరాస్యత కేంద్రాలను యు బి ఐ ద్వారా ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు .
గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా కేంద్రాల ద్వారా శిక్షణ పొందిన అభ్యర్థులకు బ్యాంకు లింకేజీ రుణాలు మంజూరు చేసేలా చూడాలని ఆర్ ఎస్ ఈ టి డైరెక్టర్ ను బ్యాంకులను కోరారు.
అలాగే వీధి వ్యాపారులు తీసుకున్న రుణాల బకాయిలను తొందరగా రికవరీ చేయాలని మెప్మా పిడి కి కలెక్టర్ ఆదేశించారు.
ఎకనామిక్స్ సపోర్టు స్కీమ్ క్రింద ఉన్న పెండింగ్ యూనిట్లను ఎస్సీ వారికి 37, ఎస్టీ వారికి 46, రూరల్ ట్రాన్స్పోర్ట్ స్కీమ్ కింద ఎసి వారికి 9 పి ఎం ఈ జి బి క్రింద42 ,mepma సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ పధకం క్రింద 18 పెండింగ్ యూనిట్ల ని త్వరగా గ్రౌండింగ్ చేయాలని బ్యాంకు లోను కలెక్టర్ ఆదేశించారు.
నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఎకనామికల్ సంపోర్ట్ స్కింల మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుంది. ముక్యంగా PMEGP పథకమైన కుటీర పరిశ్రమల లోన్ల టార్గెట్ రిచ్ కావడం కోసం ప్రయత్నం చేస్తున్నామన్నారు.
రాష్ట్రంలో మొదటిసారిగా మన జిల్లాలోకి పాడి గేదెల పంపిణి సబ్సిడీ స్కీమును కూడా తీసుకురావడం జరిగిందన్నారు
వ్వవసాయం అంటే భూమి దున్ని పంట పండిచండమే కాదని,వ్వవసాయ అనుబంద వృత్తులవారికి కూడా కేసిసి ఎలజిబులిటీ ఉంది కాబట్టి వారికి కూడా ఇవ్వాలన్నారు .
నర్సంపేట నియోజకవర్గాన్ని నాబార్డ్ సహకారంతో ఒక మోడల్ అగ్రికల్చరల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దే విధంగా ప్రభుత్వం తరుపున ఒక నిర్ణయాన్ని ప్రకటిస్తామని గతం లో అగ్రికల్చరల్ మినిస్టర్ నిరంజన్ రెడ్డి మాటిచ్చారన్నారు .
135 వేల మెట్రిక్ టన్నుల సామర్ధ్యం గల గొదాములు నర్సంపేట నియోజకవర్గంలో నిర్మాణంలో ఉన్నాయని. . ఈ సంవత్సరంలో వాటిని ఉపయోగంలోకి తీసుకువస్తామన్నారు
రైతుకు మద్దతు ధర రానప్పుడు పంటను గొదాములలో స్టోర్ చేసుకుంటారని స్టొర్ చేసినటువంటి రిసిప్ట్ తీసుకొని వస్తే ఎం.ఎస్.పి మీద 75 శాతం వడ్డీ లేని రుణాన్ని బ్యాంకర్స్ ఇచ్చేందుకు సహకరించాలన్నారు .
ఈ సమావేశం లో అదనపు కలెక్టర్ హరి సింగ్,ldm సత్య జిత్, UBI DGM శంకర్ లాల్, వివిధ బాంక్ ల రీజినల్ మేనేజర్ లు, వివిధ శాఖ లకు సంబందించిన జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.