మత్స్యకారులను అభివృద్ధి పరుస్తాం…

ప్రచురణార్థం

మత్స్యకారులను అభివృద్ధి పరుస్తాం…

తొర్రూరు
మహబూబాబాద్, సెప్టెంబర్ 21.

మత్స్యకారుల ఆర్థికాభివృద్ధిని బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మంచినీటి సరఫరా శాఖ మాత్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు ఉన్నారు.

మంగళవారం తొర్రూరు మండలం అమ్మపురం గ్రామంలో మత్స్య శాఖ ఆధ్వర్యంలో చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు ఈ సందర్భంగా పెద్ద చెరువులో రూ.1.63 లక్షల విలువ చేసే చేప పిల్లలను మంత్రి మత్స్యకారులు అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి నీళ్ళల్లో విడిచిపెట్టారు.

అనంతరం మంత్రి మాట్లాడుతూ మత్స్యకారుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం అన్నారు.

2021-22 సంవత్సరానికి గాను మత్స్యకారుల సంక్షేమార్థం ఉచిత చేప పిల్లల సరఫరా పథకం లో భాగంగా రాష్ట్రంలోనే ముప్పై మూడు జిల్లాల్లో 28వేల 44 చెరువులు రిజర్వాయర్లలో 86. 58 కోట్ల చేప పిల్లలు పోసేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు.

ఇప్పటివరకు 405 చెరువుల్లో 1.60 కోట్ల చేప పిల్లలు పోసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు మిగిలిన 27 వేల 639 చెరువుల్లో 84 .98 కోట్ల చేప పిల్లలు అక్టోబర్ మాసాంతానికి విడిచిపెట్టే ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 3220 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల లోని 3 .14 లక్షల మత్స్యకార కుటుంబాలకు లబ్ధి చేకూర నున్నదన్నారు.

జిల్లాలో 945 చెరువుల్లో అక్టోబర్ మాసాంతానికి నాలుగు లక్షల 13వేల 568 చేపపిల్లలను విడిచి పెట్టేందుకు ప్రణాళిక రూపొందించామన్నారు.

జిల్లాలో 161 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు ఉన్నాయని అందులోని పదివేల 927 మత్స్యకార కుటుంబాలకు లబ్ధి చేకూర నున్నదన్నారు

అమ్మపురం లో 134 మంది సభ్యులు ఉన్నారని ఈ గ్రామ పరిధిలోని 8 చెరువుల్లో రూ 2. 12 లక్షల విలువ కలిగిన 1.78 లక్షల చేప పిల్లలు విడిచిపెట్టనున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారి బుచ్చిబాబు మత్స్యకారుల జిల్లా అధ్యక్షులు గొడుగు శ్రీనివాస్ మత్స్యకారులు అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
————————————————–
జిల్లా పౌరసంబంధాల అధికారి మహబూబాబాద్ చే జారీ చేయడమైనది

Share This Post