మత్స్యకారులు సాధికారత సాధించాలి…

ప్రచురణార్థం

మత్స్యకారులు సాధికారత సాధించాలి…

మహబూబాబాద్ నవంబర్ 21.

మత్స్యకారుల సంక్షేమార్థం ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని జిల్లా మత్స్య సంక్షేమ అధికారి బుజ్జి బాబు తెలిపారు.

ఆదివారం మత్స్య శాఖ కార్యాలయంలో
ప్రపంచ మత్స్య దినోత్సవ కార్యక్రమాన్ని మత్స్యశాఖ ఘనంగా నిర్వహించింది

ఈ సందర్భంగా జిల్లా మత్స్యశాఖ అధికారి బుజ్జి బాబు మాట్లాడుతూ జిల్లాలోనే ప్రాథమిక మత్స్య సహకార సంఘాల యొక్క ప్రతినిధులు సహకార సంఘాలను బలోపేతం చేయాలన్నారు.
అధిక సంఖ్యలో సభ్యులను సంఘాలలో చేర్చి వారి ఆర్థిక ప్రగతికి కృషి చేయాలన్నారు

ఈ కార్యక్రమంలో గొడుగు శ్రీనివాస్ కార్యదర్శి, రాష్ట్ర కార్యదర్శి ముదిరాజ్ మహాసభ, నాగయ్య జిల్లా గంగపుత్ర నాయకులు, కొత్తూరు రమేష్ అధ్యక్షులు ప్రాధమిక మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అమ్మపురం, పిడుగు వెంకన్న, సమ్మయ్య బుచ్చయ్య అధ్యక్షులు , మత్స్య పారిశ్రామిక సహకార సంఘం కల్వల, సరోజ మహిళా మత్స్య సహకార సంఘం మహబూబాబాద్, వివిధ సంఘాల సభ్యులు మత్స్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
————————————–
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post