మత్స్యకారుల సంక్షేమార్ధం చర్యలు తీసుకోవాలి

ప్రచురణార్ధం

మత్స్యకారుల సంక్షేమార్ధం చర్యలు తీసుకోవాలి.

మహబూబాబాద్, నవంబర్,24.

మత్స్యకారుల సంక్షేమార్ధం చర్యలు తీసుకోవాలని.జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు.

బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని ప్రగతి సమావేశమందిరంలో మత్స్య కారుల సంక్షేమానికి తీసుకోవలసిన చర్యలపై కలెక్టర్ సమీక్షించారు.

జిల్లాలో 1288 చెరువులు ఉన్నాయని, మండలాల వారీగా మత్యకారుల సొసైటీల వివరాలు ఇవ్వడం జరుగుతుందని, నూతన ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య 268 ప్రకారం మత్స్య సహకార సంఘాల పరిధిలో ఉన్న పంచాయతీ చెరువులు కూడా వారికే లీజు కు ఇచ్చే విధంగా, సంఘాల పరిధిలో లేనివి బహిరంగ వేలం ద్వారా లీజ్ కు ఇచ్చే విధంగా ఎం.పి.డి.ఓ. లు కృషి చేయాలన్నారు. సొసైటీలను గుర్తించి జూలై 1వ తేదీ నుండి జూన్ 30వ తేదీ వరకు మాత్రమే లీజ్ గడువుగా తెలియజేయాలన్నారు.నూతన పంచాయతీ లలో సొసైటీ పరిధిలో ఉన్న చేరువు లు కూడా సొసైటీకి చెందే విధంగా లీజ్ కు ఇవ్వాలన్నారు.

1288 చెరువుల్లో 992 స్వల్ప కాలిక సీజనల్ చేరువులని 296 దీర్ఘ కాలిక శాశ్వత చెరువులుగా పేర్కొన్నారు.

చెరువుల విస్తీర్ణం, చెరువుకు 2 పేరు లు ఉన్నట్లయితే మార్పు చేర్పుల కొరకు మత్స్య శాఖకు నివేదిక అందించాలన్నారు.

జలవనరులను పరిరక్షించుకుంటూ మత్స్య సంపద పెంచాలన్నారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ మత్స్య శాఖ అధికారి బుజ్జి బాబు డిఆర్డిఎ పిడి సన్యాసయ్య, డి.పి.ఓ.సాయి బాబా ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.
————————————-
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post