మత్స్యకారుల సంఘాల సభ్యత్వ నమోదు పై సిద్దిపేటలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మత్స్యశాఖ అధికారులతో రాష్ట్ర ఆర్థిక మరియు వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు సమీక్ష సమావేశం నిర్వహించారు.


సిద్ధిపేట 24 జనవరి 2023 :
మత్స్యకారుల సంఘాల సభ్యత్వ నమోదు పై సిద్దిపేటలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మత్స్యశాఖ అధికారులతో రాష్ట్ర ఆర్థిక మరియు వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎమ్మెల్సీ బండ ప్రకాష్ ముదిరాజ్, రాష్ట్ర మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యా, జిల్లా అదనపు కలెక్టర్లు ముజామిల్ ఖాన్, శ్రీనివాస్ రెడ్డి, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్ సభ్యుడు పాల సాయిరాం, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ జిల్లాల మత్స్యశాఖ అధికారులు, రాష్ట్ర మత్స్య శాఖ కమిషనర్ కార్యాలయ అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రివర్యులు హరీష్ రావు మాట్లాడుతూ..

మత్స్యకార వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న వారి కుటుంబాలు మత్స్య సంపద ద్వారా గరిష్టంగా లబ్ధి పొందాలనేది రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని దిశానిర్దేశం.

తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత సాగునీటి ప్రాజెక్టులు, చెక్ డ్యాములు, రిజర్వాయర్ల నిర్మాణానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం మూలంగా రాష్ట్రంలో జల వనరుల సంపద పెరిగిందని వెల్లడి.

మత్స్యకార సంఘాలలో మత్స్యకారులకు సభ్యత్వ నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని మత్స్యశాఖ అధికారులకు ఆదేశం.

నూతనంగా మత్స్యకార సంఘాలలో సభ్యత్వం పొందే వారికోసం నిర్వహిస్తున్న పరీక్షలను నెల రోజులలోగా పూర్తి చేసి సభ్యత్వ నమోదు ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశం.

చేపలు పట్టడం, వలలు విసరడం, ఈత కొట్టడం తదితర రంగాలలో అవసరమైతే ముందస్తుగా శిక్షణ ఇవ్వాలని సూచన.

సిద్దిపేట జిల్లాలో దాదాపు 14 వేల మంది మత్స్యకారులు నూతనంగా సభ్యత్వం పొందేందుకు అర్హత కలిగి ఉన్నారు. వారందరికీ అవసరమైతే ముందస్తు శిక్షణ ఇచ్చి పరీక్ష నిర్వహించాలని సూచన.

జిల్లాలో జిల్లా కలెక్టర్, జిల్లా అదనపు కలెక్టర్లు, స్థానిక ప్రజా ప్రతినిధులు, మత్స్యశాఖ అధికారులు, ఎంపీడీవోలు, ఎంపీఓలు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి జిల్లాలో గల 14 వేల మంది మత్స్యకారులకు నూతనంగా సభ్యత్వ నమోదు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశం.

సంగారెడ్డి, మెదక్ జిల్లాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో మత్స్యకార సంఘాల సభ్యత్వం త్వరగా పూర్తి చేయాలని సూచన.

రాష్ట్రవ్యాప్తంగా మత్స్యకార సంఘాలలో ఇప్పటికే నమోదు అయిన 3 లక్షల 60 వేల మందితో పాటు నూతనంగా మత్స్యకార సంఘాల్లో నమోదయ్యే మత్స్యకారులందరికీ సామూహికంగా హైదరాబాదులో ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖర రావు ఫోటోతో కూడిన మత్స్యకార డిజిటల్ గుర్తింపు కార్డులను ఫిబ్రవరి మాసంలో అందించేందుకు మత్స్యశాఖ చర్యలు చేపట్టాలని దిశానిర్దేశం.

ప్రమాదవశాత్తు మరణించిన మత్స్యకారులకు పెండింగ్లో ఉన్న ఎక్స్గ్రేషియాను అందించుటకు మత్స్యశాఖ వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశం.
issued by Disrict public relations officer siddipet

Share This Post