మత్స్యరంగానికి ఊపిరి పోసిన ఘనత ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్‌ దే : రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖ మంత్రి తలసాని శ్రీ శ్రీనివాస్‌ యాదవ్‌

మాట్లాడుతున్న మంత్రి

సమైక్య పాలనలో కులవృత్తులు నిరాదరణకు గురై గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ధ్వంసం అయ్యిందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖ మంత్రి తలసాని శ్రీ శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు . ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో మత్స్యరంగం కుదేలయ్యిందన్నారు. స్వరాష్ట్రం సాధించుకున్న తర్వాత కులవృత్తులకు పూర్వవైభవం కల్పించి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ను పరిపుష్టం చేయాలన్న సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు ముందుకు సాగుతున్నారని అన్నారు . ఈ క్రమంలోనే మత్స్యరంగానికి ఊపిరి సీఎం శ్రీ కేసీఆర్‌ ఊపిరి పోశారని అన్నారు .

సోమవారం మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, జిల్లా కలెక్టర్ పి వెంకట్రామ్‌రెడ్డితో కలిసి బెజ్జంకి మండలం తోటపల్లి రిజర్వాయర్‌లో లక్షా 80 వేల చేప పిల్లలను రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖ మంత్రి తలసాని శ్రీ శ్రీనివాస్‌ యాదవ్‌ విడుదల చేశారు.
మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెంచడానికే ప్రభుత్వం సమీకృత మత్స్య అభివృద్ధి పథకం ద్వారా 2014 నుంచి ఉచిత చేప పిల్లల విడుదల కార్యక్రమం చేపడుతుందన్నారు. కులవృత్తులకు పూర్వ వైభవం కల్పించేoదుకు ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ సంవత్సరం రూ.115 కోట్లతో 93 కోట్ల చేప పిల్లలను, 25 కోట్ల రొయ్య పిల్లలను జల వనరుల లో విడుదల చేస్తున్నాం.
సిద్దిపేట జిల్లాలో రూ.4 కోట్ల 87 లక్షల రూపాయలతో అన్ని జలాశయాలు, చెరువుల్లో 4 కోట్ల 19 లక్షల చేప, రొయ్య పిల్లలను వదులుతున్నామని వివరించారు. ఉచిత చేప పిల్లల పంపిణీ పథకంతో స్వరాష్ట్రంలో మత్స్యకారుల జీవితాల్లో సీఎం శ్రీ కేసీఆర్‌ కొత్త వెలుగులు నింపారని ప్రశంసించారు.
మత్స్య కారులు జిల్లా ఫిషరీస్ అధికారులను సమన్వయం చేసుకుంటూ పండుగ వాతావరణంలో ప్రతి చెరువులో చేప పిల్లల విడుదల చేయాలన్నారు. చేప పిల్లల విడుదల కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు భాగస్వామ్యం చేయాలి.
విడుదల ప్రక్రియ ఆద్యాంతం వీడియో గ్రఫీ చేస్తున్నామని పేర్కొన్నారు. గౌరవెల్లి ప్రాజెక్ట్ పూర్తయితే 2 లక్షల ఎకరాలకు సాగునీరు, తోటపల్లి జలాశయంతో 75 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని మంత్రి తలసాని తెలిపారు.

సంచార మత్స్య విక్రయ వాహనాల ను ప్రారంభించిన మంత్రి
తోటపల్లి లో రూ.20 లక్షల రూపాయల విలువైన రెండు మొబైల్ ఫిష్ ఔట్ లెట్- సంచార వాహనాలను రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమ ల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించి లబ్దిదారులకు అందజేశారు.

మత్స్యకారులకు బాసటగా.. మొబైల్ ఫిష్ రిటైల్ ఔట్ లెట్ వెహికిల్స్ నిలుస్తాయని, వీటివలన మత్స్యకారులకు ఆర్థిక పుష్టి, ప్రజలకు ఆరోగ్య పుష్టి కలుగుతుందని మంత్రి అన్నారు.

రెండో విడతలో డి డి లు కట్టే గొల్ల , కుర్మలకు నెలలోపే గొర్రెల యూనిట్ లను మంజూరు చేస్తాం : మంత్రి
స్థానిక శాసన సభ్యులు శ్రీ రసమయి బాలకిషన్ విజ్ఞప్తి మేరకు మానకొండూర్ నియోజకవర్గంలోని బెజ్జంకి , బేగంపేట , తోటపల్లి గ్రామాలలో ఫిష్ మార్కెట్ ల నిర్మాణం కు ఆర్థిక సహాయం అందిస్తామని తెలిపారు. గుండారం ,కల్లేపల్లి , బేగంపేట చెరువులలో మళ్ళి చేపలు వదులుతామని మంత్రి తెలిపారు .

అలాగే మానకొండూర్ నియోజకవర్గంలో ఇదివరకే డిడి లు కట్టిన గొల్ల , కుర్మలకు సాధ్యమైనంత త్వరలో గొర్రెల యూనిట్ లను మంజూరు చేస్తామని తెలిపారు . అలాగే రెండో విడతకు సంబంధించి గొర్రెల యూనిట్ ల మంజూరు కోసం డిడి లు కట్టే గొల్ల , కుర్మలకు నెలలోపే గొర్రెల యూనిట్ లను మంజూరు చేస్తామని మంత్రి తెలిపారు .

కార్యక్రమంలో మత్స్యశాఖ కమిషనర్ భూక్యా లచ్చిరాం నాయక్, అదనపు సంచాలకులు శంకర్ రాథోడ్ , rdo జయ చంద్రా రెడ్డి , జిల్ల మత్స్య శాఖ అధికారి మధు సూ దన్ , స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు .

Share This Post