నేషనల్ ఫౌండేషన్ ఫర్ కమ్యూనల్ హార్మనీ ఆదేశానుసారం నవంబర్ 19 నుండి 25 తేదీ వరకు మత సామరస్య ప్రచారం వారోత్సవం గా నిర్వహిస్తున్నారు. ఈ ప్రచారంలో భాగంగా ప్రజల్లో మత సామరస్యం పట్ల అవగాహన, ఆవశ్యకత, జాతీయ సమైక్యతా మరియు సౌబ్రాతృత్యం పై సాంస్కృతిక కార్యక్రమాలు, సెమినార్లు, వర్క్ షాపులు, వక్తృత్వ, చిత్రలేఖనం తదితర అంశాలను ఏర్పాటు చేసి ఫ్లాగ్ డే సందర్బంగా విరాళాలను సేకరిస్తారు. సేకరించిన విరాళాలను మత, కుల, టెర్రరిస్ట్ ఘర్షణలతో తల్లిదండ్రులను కోల్పోయిన అనాధ చిన్నారుల పునరావాసాని కై వినియోగిస్తారు.

