మదనాపురం మండలంలోని కొన్నూరులో రైతు వేదిక భవనాన్నిప్రారంభించిన వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష, జిల్లా ఎస్పీ అపూర్వ రావు.

పత్రిక ప్రకటన.                                                                    తేది:7.7.2021
వనపర్తి.
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, రైతులకు అన్ని విధాలుగా తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు
మంగళవారం మదనాపురం మండలంలోని కొన్నూరులో రైతు వేదిక భవనాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన రైతు సభలో ఆయన మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో రైతులు అన్ని విధాలుగా నష్టపోయారని, కరెంటు సమస్యతో ధర్నాలు రాస్తారోకోలు చేశారని ఆయన గుర్తుచేశారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం రైతులకు పెద్దపీట వేసిందని కరెంటు కొరత తీర్చి పుష్కలంగా తాగునీరు అందించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే అని ఆయన తెలిపారు.
అనంతరం మదనాపురం మండల కేంద్రంలో పునర్నిర్మించిన పోలీస్ స్టేషన్ భవనాన్ని మంత్రి ప్రారంభించారు. పోలీస్ శాఖలో అనేక మార్పులు తీసుకువచ్చి, తెలంగాణ సర్కార్ ఫ్రెండ్ పోలీసింగ్ ద్వారా రాష్ర్టానికి ప్రథమ స్థానం దక్కిందని ఆయన కొనియాడారు. శాంతిభద్రతల విషయంలో రాజీ లేకుండా పనిచేస్తోందని, హైదరాబాద్ నగరంలో అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిఘా పెంచా మని మంత్రి సూచించారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా క్షణాల్లో డీజీపీ వరకు చేరే సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపొందించామని మంత్రి వెల్లడించారు. మదనాపురం పోలీస్ స్టేషన్ భవన నిర్మాణంలో పాలుపంచుకున్న ఎస్ఐ తిరుపాజీతో పాటు జిల్లా ఎస్పీ అపూర్వారావును ఆయన అభినందించి, పూలమాల, శాలువాతో సన్మానించారు.
రైతుబంధు పథకానికి 7.360…కోట్లు తెలంగాణ రాష్ట్రంలో రైతులకు ఆర్థిక పురోగతి కల్పించాలన్న ఆకాంక్షతో రైతు పెట్టుబడి పథకం కింద రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ 7.360కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేశామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఈ సందర్భంగా వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
………
జిల్లా పౌర సంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.

Share This Post