మద్దతు ధరల పోస్టర్లను విడుదల చేసిన జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య

జనగామ, అక్టోబర్ 8: ప్రభుత్వం 2021-22 పంట కాలానికి గాను వివిధ పంటలకు ప్రకటించిన మద్దతు ధరలకు సంబంధించి పోస్టర్లను జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ లో శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రైతులు నాణ్యత గల పత్తిని పండించి, మద్దతు ధరతో పాటుగా సీసీఐ ప్రకటించిన బోనస్ కూడా పొందాలని అన్నారు.
ఈ సందర్భంగా ప్రత్యేకించి పత్తి పంట నాణ్యత ప్రమాణాలు, సీసీఐ అదనపు ప్రోత్సాహకాలు తెలిపే పోస్టర్ ను కలెక్టర్ ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) అబ్దుల్ హామీద్, జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ విజయ, పాలకుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రాంబాబు, జిల్లా మార్కెటింగ్ అధికారి కె. నాగేశ్వర శర్మ, డిఆర్డీవో జి. రాంరెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి రాధిక, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌరసంబంధాల అధికారి, జనగామచే జారిచేయనైనది.

Share This Post