మద్యం దుకాణాలను సామాజిక వర్గాల వారీగా లక్కీ డిప్ ద్వారా రిజర్వేషన్ ప్రక్రియకు ఖరారు చేసిన జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్

గిరిజనులకు 4 మద్యం దుకాణాలను, ఎస్సీలకు 9 దుకాణాలను గౌడ్లుకు 9 దుకారణాల రిజర్వేషన్ ద్వారా కేటాయింపు

మద్యం దుకాణాలను సామాజిక వర్గాల వారీగా లక్కీ డిప్ ద్వారా రిజర్వేషన్ ప్రక్రియకు ఖరారు చేసిన జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్

నాగర్ కర్నూలు జిల్లాలోని 67 మద్యం దుకాణాల కేటాయింపుకు రిజర్వేషన్ల విధానాన్ని సోమవారం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి,
జిల్లా వెనకబడిన తరగతుల సంక్షేమ అధికారి,
జిల్లా షెడ్యూల్‌ కులాల అభివృద్ధి అధికారుల, జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ అధ్యక్షతన మద్యం షాపులకు సామాజిక వర్గాల వారీగా రిజర్వేషన్లను కేటాయించారు.
మొదటగా గిరిజన ప్రాంతానికి చెందిన అమ్రాబాద్, మన్ననూర్, పదర, బల్మూర్ ఏజెన్సీ దుకాణాలను గిరిజనులకు కేటాయించారు.
ఎస్సీలకు 40,15,11,55,32,06,58,45,47 తొమ్మిది మద్యం దుకాణాలను లక్కీ డిప్ ద్వారా కేటాయించారు.
49,05,16,33,24,60,53,26,50 నెంబర్ల 9 మద్యం దుకాణాలను గౌడ కులస్థులకు లక్కీ డిప్ ద్వారా కేటాయించారు.
సామాజిక వర్గాల వారీగా రిజర్వేషన్లు ఖరారైన తర్వాత
మిగిలిన 45 మద్యం దుకాణాలను ఓపెన్‌ కేటగిరీగా పరిగణించారు.
ఈ నెల 9వ తేదీ నుంచి 18వ తేదీ వరకు మద్యం దుకాణాలకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి దత్తు రాజ్ గౌడ్ తెలిపారు.
ప్రతి మద్యం దుకాణానికి దరఖాస్తుదారులు 2 లక్షల రూపాయల డిడితో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.
నవంబర్ 20వ తేదీన లక్కీడిప్ ద్వారా మద్యం దుకాణాలను కేటాయించనున్నట్లు ఆయన వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎక్సైజ్ అధికారి దత్తు రాజ్ గౌడ్, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి అనిల్ ప్రకాష్, గిరిజన సంక్షేమ శాఖ అధికారి అశోక్, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి రామ్ లాల్, ఎక్సైజ్ శాఖ సిఐలు పరమేశ్వర్ గౌడ్, ఏడుకొండలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share This Post