మద్యం దుకాణాలు ఏర్పాటుకు ప్రభుత్వ మార్గదర్శకాలు మేరకు ఎస్సి, గౌడ కులస్తులకు రిజర్వేషన్ల ఖరారు చేసినట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు

. సోమవారం కలెక్టరెట్ సమావేశపు హాలులో ఎక్సైజ్, గిరిజన సంక్షేమ, ఎస్సీ అభివృద్ధి అధికారుల సమక్షంలో లాటరీ నిర్వహించి రిజర్వేషన్లు ఖరారు చేసినట్లు చెప్పారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 88 ఏ4 మద్యం దుకాణాలుండగా ఎస్టీకి 44 దుకాణాలు కేటాయించగా గిరిజనేతర ప్రాంతాల్లో ఉన్న మద్యం దుకాణాలకు ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఎస్సీలు, గౌడ కులస్థులకు కేటాయించాల్సి ఉన్నందున డ్రా నిర్వహించినట్లు చెప్పారు. ప్రభుత్వ మార్గదర్శకాలు మేరకు ఎస్సీలకు 7, గౌడ కులస్థులకు 6 దుకాణాలు కేటాంచాల్సి ఉండగా మద్యం దుకాణాలు కేటాయింపుకు నిర్వహించిన లాటరీలో గెజిట్ సీరియల్ నెంబర్లు ప్రకారం ఎస్సీలకు 75,7, 76,1,21,43,23, గౌడ కులస్థులకు గెజిట్ సీరియల్ నెంబర్లు ప్రకారం 42, 5,36,82,4,12 దుకాణాలు కేటాయించినట్లు చెప్పారు. ఈ నెల 9వ తేదీ నుండి 18వ తేదీ వరకు సుద్యం దుకాణాల ఏర్పాటుకు దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. ఎస్సీ, గౌడ కులస్థులకు మద్యం దుకాణాలు కేటాయింపు ప్రక్రియను మొత్తం వీడియో గ్రఫి చేసినట్లు చెప్పారు. మిగిలిన 31 మద్యం దుకాణాలు జనరల్ కేటగిరికి కేటాయించినట్లు ఆయన తెలిపారు. కొత్తగూడెంలో 2 ఎస్సీలకు, 3 గౌడలకు, పాల్వంచలో 2 ఎస్సీలకు, ఇల్లందులో 2. ఎస్సీలకు, ఒకటి గౌడలకు, అశ్వారావుపేటలో ఒకటి ఎస్సీలకు, 2 గౌడలకు కేటాయింపు జరిగినట్లు చెప్పారు. మద్యం దుకాణాలు కేటాయింపులు ప్రక్రియ పూర్తయినందున 9వ తేదీ మంగళవారం నుండి ఈ నెల 18వ తేదీ వరకు దుకాణాలు ఏర్పాటుకు ఆసక్తి ఉన్న వ్యక్తులు బాబుక్యాంపు, కొత్తగూడెంలో ఉన్న ఎక్సైజ్ ఈఎస్ కార్యాలయంలో కార్యాలయపు పని చేయు వేళల్లో దరఖాస్తులు చేసుకోవాలని చెప్పారు. దరఖాస్తులు స్వీకరణ పూర్తయిన తదుపరి ఈ నెల 20వ తేదీ కొత్తగూడెంలోని ఎన్కో నగర్లో ఉన్న ఖమ్మ వారి కళ్యాణ మండపం నందు డ్రా నిర్వహించి మద్యం దుకాణాలు కేటాయింపు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఈఎస్ నరసింహారెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకులు రమాదేవి, ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి అసనూయ, బిసి సంక్షేమ అధికారి సురేందర్ తదితరులు పాల్గొన్నారు.

 

Share This Post