మద్యం దుకాణాల కేటాయింపు కొరకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఏలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేయాలి… కలెక్టర్ నిఖిల.

వికారాబాద్ జిల్లా పరిధిలోని ఐదు స్టేషన్ల పరిధిలో మద్యం దుకాణాల కేటాయింపు కొరకు స్థానిక శ్రీ శక్తి భవన్ లో ఏర్పాటు చేసిన దరఖాస్తుల స్వీకరణ సెంటర్ను జిల్లా కలెక్టర్ నిఖిల ఆకస్మికంగా తనిఖీ చేసి నిర్వహిస్తున్న పనులను పరిశీలించారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎలాంటి సమస్యలు లేకుండా ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించాలని ఎక్సయిజ్ అధికారులకు ఆదేశించారు . జిల్లాలోని ఐదు స్టేషన్ల వారిగా వచ్చిన దరఖాస్తులను పరిశీలించారు. దరఖాస్తు దారులతో మాట్లాడుతూ ఏమైనా ఇబ్బందులు, సమస్యలు ఉన్నాయా, బ్యాంకర్లు డిడి ల జారీ విషయంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడుగగా ఎలాంటి ఇబ్బందులు లేవని వారు కలెక్టర్ కు తెలియజేసినారు. జిల్లాలో యస్సి రిజర్వేషన్ క్రింద కేటాయించిన తొమ్మిది మద్యం దుకాణాలకు సంబంధించి వచ్చిన దరఖాస్తులను పరిశీలించారు. ఈ సందర్బంగా ఎక్సయిజ్ సూపరింటెండెంట్ తో మాట్లాడుతూ గురువారం సాయంత్రం 5:00 గంటలతో దరఖాస్తుల స్వీకరణ ముగుస్తున్నందున, ఏలాంటి సమస్యలు లేకుండా పని పూర్తి చేయాలని తెలిపారు. ఈ నెల 20న (శనివారం ) స్థానిక అంబేద్కర్ భావనంలో ఉదయం 11:00 గంటలకు డ్రాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.
ఈరోజు సాయంత్రం వరకు ఐదు స్టేషన్ల పరిధిలో మొత్తం 255 దరఖాస్తులు స్వీకరించడం జరిగిందని, తాండూర్ స్టేషన్ పరిధిలో మొత్తం 17 షాపులకు గాను 75, వికారాబాద్ లో 15 షాపులకు 56, పరిగిలో 12 షాపులకు 81, కొడంగల్ లో 08 షాపులకు 23, మోమిన్ పెటలో 06 షాపులకు గాను 20 దరఖాస్తులు స్వీకరించినట్లు ఎక్సయిజ్ సూపరింటెండెంట్ వరప్రసాద్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమీషనర్ పల్లవి, ఐదు స్టేషన్ ల సిఐ లు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share This Post