*మద్యం దుకాణాల కేటాయింపుకు ఈ నెల 29 వ తేదీ వరకు గడువు :: ఎక్సైజ్ సీఐ ఎం.పీ.ఆర్. చంద్రశేఖర్

*మద్యం దుకాణాల కేటాయింపుకు ఈ నెల 29 వ తేదీ వరకు గడువు :: ఎక్సైజ్ సీఐ ఎం.పీ.ఆర్. చంద్రశేఖర్

*ప్రచురణార్థం-2*
రాజన్న సిరిసిల్ల, నవంబర్ 26: జిల్లాలో దరఖాస్తులు తక్కువగా వచ్చిన కారణంగా లైసెన్స్ డ్రా తీయకుండా నిలిపివేసిన దుకాణాల కేటాయింపుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సిరిసిల్ల ఎక్సైజ్ సీఐ ఎం.పీ.ఆర్. చంద్రశేఖర్ శుక్రవారం సాయంత్రం ఒక ప్రకటన తెలిపారు. జిల్లాలో రుద్రంగి, కోనరావుపేట మండలం నిమ్మపెల్లి గ్రామంలోని మద్యం దుకాణాల కేటాయింపు కోసం దరఖాస్తుల స్వీకరణకు ఈ నెల 29 వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు గడువు ఉందని ఆయన తెలిపారు. 30 వ తేదీ రోజున సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన లక్కీ డ్రా నిర్వహించడం జరుగుతుందని ఆయన అన్నారు. నిమ్మపెల్లి మద్యం దుకాణానికి ఇప్పటివరకు 12 దరఖాస్తులు, రుద్రంగి మద్యం దుకాణానికి 9 దరఖాస్తులు వచ్చినట్లు ఆయన ప్రకటనలో పేర్కొన్నారు.

Share This Post