మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియ పూర్తి- జిల్లా కలెక్టర్ పీ. ఉదయ్ కుమార్

2021-2023 సంవత్సరం మద్యం పాలసీ లో భాగంగా నాగర్ కర్నూలు జిల్లాలో లింగాల షాప్ నెంబర్ 31, అమ్రాబాద్ మండలం తుర్కపల్లి 63 షాప్ నెంబర్ ల రెండు మద్యం దుకాణాలకు ఈ నెల 9వ తేదీ నుండి 18వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించారు.
గజిట్ సీరియల్ నెంబర్ 31 లింగాల మరియు అమ్రాబాద్ మండలం తుర్కపల్లి గజిట్ సీరియల్ నెంబర్ 63 మద్యం దుకాణాలకు అతి తక్కువ దరఖాస్తులు రావడంతో ప్రభుత్వం ఈ రెండు మద్యం దుకాణాలకు రీ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది.
31 గజిట్ నెంబర్ లింగాల మద్యం దుకాణానికి 11 టెండర్లు నమోదుకాగా అమ్రాబాద్ మండలం తుర్కపల్లి 63 గజిట్ నెంబర్ మద్యం దుకాణానికి 14 టెండర్లు నమోదయ్యాయి.
అందులో భాగంగానే మంగళవారం కలెక్టరేట్ గ్రీవెన్స్ సెల్ సమావేశమందిరంలో జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో రెండు మద్యం దుకాణాలకు లక్కీ డ్రా నిర్వహించారు.
లింగాల షాప్ నెంబర్ 31 మద్యం దుకాణానికి ఎం స్వాతికి అమ్రాబాద్ మండలం తుర్కపల్లి 63 మద్యం దుకాణానికి డి వెంకట్ రామ్ నాయక్ లకు లక్కీడ్రా ద్వారా జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ మద్యం దుకాణాలను కేటాయించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారి దత్త రాజ్ గౌడ్, ఎక్సైజ్ సిఐలు పరమేశ్వర్ గౌడ్, ఏడుకొండలు, అనంతయ్య లు సిబ్బంది టెండర్ దారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post