మద్యం దుకాణాల టెండర్ల స్వీకరణ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సిహెచ్.శివలింగయ్య

జనగామ నవంబరు 15 :
సోమవారం జనగామ
జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో జరుగుతున్న
2021_23 సంవత్సరానికి గాను మద్యం దుకాణాల లైసెన్సు జారీ ప్రక్రియను కలెక్టర్ శివలింగయ్య స్వయంగా పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..
జిల్లాలో 47 మద్యం దుకాణాలకు లైసెన్సులు జారీ చేయాల్సి ఉందని, 18వ తేదీ వరకు కార్యాలయ పని వేళల్లో దరఖాస్తులు స్వీకరణ కొన సాగుతోందని తెలియజేశారు. ప్రభుత్వ గైడ్లైన్స్ ప్రకారం 20వ తేదీన జనగామ లోని నందన గార్డెన్స్ నందు నిర్వహించే ఈ కార్యక్రమాన్ని వీడియో కవరేజ్ చేయాలని,
ట్రాఫిక్ రద్దీ నియంత్రణకు పోలీస్ యంత్రాంగం బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ఎంట్రీ పాసులు జారీ చేసిన వారిని మాత్రమే లోనికి పంపాలని దరఖాస్తుల వివరాలను క్రమం తప్పకుండా రిజిస్టర్లో నమోదు చేయాలని సూచించారు. అదేవిధంగా సోమవారం సాయంత్రం వరకు, జిల్లా వ్యాప్తంగా 51 దరఖాస్తులు వచ్చాయని ఈ సందర్భంగా కలెక్టర్ తెలియజేశారు. టెండర్లు వెయ్యవలసిన వారు ఇంకా ఎవరైనా ఉంటే 18వ తేదీ వరకు టెండరు పత్రాలను జిల్లా ఎక్సైజ్ కార్యాలయంలో నమోదు చేయాలని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆర్. మహిపాల్ రెడ్డి, సిఐలు సిహెచ్.నాగేశ్వర్ రావు, బి.ముకుందరెడ్డి, ఎం.బ్రహ్మానందరెడ్డి, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Share This Post