మద్యం దుకాణాల నిర్వహణ దరఖాస్తు టెండర్ ప్రక్రియ,డ్రా ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా కలెక్టర్*

మద్యం దుకాణాల నిర్వహణ దరఖాస్తు టెండర్ ప్రక్రియ,డ్రా ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా కలెక్టర్*        నవంబర్17,నల్గొండ. జిల్లాలో మద్యం దుకాణాల నిర్వహణకు రేపు గురువారం(నవంబర్ 18) తో దరఖాస్తులు గడువు ముగియ నుండడం తో దరఖాస్తుల  ప్రక్రియ  ఊపందుకుంది.బుధవారం జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ నల్గొండ జిల్లా కేంద్రం లోని ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయం ను సందర్శించి మద్యం దుకాణాల కు దరఖాస్తుల ప్రక్రియ పరిశీలించి ఎక్సైజ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.అనంతరం దేవరకొండ రోడ్డు లోని జి.యం.కన్వెన్షన్  ఫంక్షన్ హాల్ లో ఈ నెల మద్యం దుకాణాల నిర్వహణకు డ్రా తీయనున్నందున జిల్లా కలెక్టర్ ఎక్సైజ్, పోలీస్, రెవెన్యూ అధికారులతో ఏర్పాట్లు పరిశీలించి సూచనలు చేశారు.డ్రా రోజున వచ్చే అధికారులు,దరఖాస్తు దారులకు త్రాగు నీటి సౌకర్యం,విద్యుత్,అగ్ని మాపక వాహనం,పార్కింగ్ మౌలిక సదుపాయాలు  ఏర్పాటు చేయాలని ఎక్సైజ్ సూపరింటెండ్ ను జిల్లా కలెక్టర్ ఆదేశించినారు. అలాగే డిజిటల్ స్క్రీన్ ఏర్పాటు  చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో   ఆర్డీఓ జగదీశ్వర్ రెడ్డి,డి.ఎస్.పి.వెంకటేశ్వర్ రెడ్డి,ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ శంభు ప్రసాద్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ హిమశ్రీ తదితరులు పాల్గొన్నారు.

Share This Post