మద్యం దుకాణాల రిజర్వేషన్ల కేటాయింపులు లక్కీ డిప్ ద్వారా ఎంపిక : జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

పత్రికా ప్రకటన.    తేది:8.11.2021, వనపర్తి.

ప్రభుత్వ ఆదేశాల మేరకు మద్యం దుకాణాల రిజర్వేషన్ల కేటాయింపులు లక్కీ డిప్ ద్వారా ఎంపిక చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష తెలిపారు.
సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో లాటరీ పద్ధతి ద్వారా మద్యం దుకాణాల కేటాయింపుల కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వనపర్తి జిల్లాలో మొత్తం (37) మద్యం షాపులను కేటాయిస్తున్నట్లు ఆమె సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎక్సైజ్ శాఖ వారి జీ.ఓ. నెంబర్ 98 ప్రకారం జిల్లాలో రిటైల్ మద్యం దుకాణాలను 2021-23  సం. నికి ఎస్.టి, ఎస్.సి, గౌడలకు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ననుసరించి రిజర్వేషన్ మేరకు లాటరీ ద్వారా మద్యం దుకాణాలను కేటాయించడం జరిగిందని ఆమె సూచించారు.
ఎక్సైజ్, గిరిజన సంక్షేమ శాఖ, సాంఘిక సంక్షేమ శాఖ, బి.సి.అభివృద్ధి శాఖ అధికారుల సమక్షంలో జిల్లా కలెక్టర్ డ్రా పద్ధతి ద్వారా మద్యం షాపులను కేటాయించడం జరిగింది. జిల్లాలో మొత్తం (37) రిటైల్ మద్యం షాపులకు గాను, ఎస్.టి.లకు (1), ఎస్.సి.లకు (5), గౌడ సామాజిక వర్గాలకు (4), రిటైల్ మద్యం షాపులను జిల్లా కలెక్టర్ డ్రా పద్ధతి ద్వారా కేటాయించినట్లు ఆమె వివరించారు. మద్యం దుకాణాలలో 15% గౌడలకు, 10% ఎస్.సి.లకు, 5% ఎస్.టి.లకు రిజర్వేషన్ కల్పిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఎస్.సి, ఎస్.టి, గౌడ వర్గాలకు ప్రభుత్వ ఎక్సైజ్ కమిషనర్ జారీ చేసిన మార్గదర్శకాలను అనుసరించి కేటాయించగా (27) మద్యం షాపులు జనరల్ కేటగిరి కింద కేటాయిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వివరించారు.
వనపర్తి మున్సిపాలిటీకి షాప్ నెంబర్ 1,6,7ను, పెబ్బేరు మున్సిపాలిటీకి 26,28 లను, కొత్తకోట మున్సిపాలిటీకి 19,18,24 ను శ్రీరంగాపూర్ గ్రామానికి 30ని, ఖిల్లా ఘనపూర్ గ్రామానికి 9వ. నెంబర్ గల మద్యం దుకాణాలను లాటరీ పద్ధతి ద్వారా కేటాయించినట్లు జిల్లా కలెక్టర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ అధికారి సైదులు, సాంఘిక సంక్షేమ అధికారి మల్లికార్జున్, జిల్లా బి.సి.అభివృద్ధి శాఖ అధికారి కేశవులు, జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ అధికారిణి యాదమ్మ, తదితరులు పాల్గొన్నారు.
…………
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.

Share This Post