మద్యం షాపులకు 488 దరఖాస్తులు జిల్లా డిప్యూటీ కమిషనర్ కే.ఏ. బి.శాస్త్రి

 

మద్యం షాపులకు 488 దరఖాస్తులు

జిల్లా డిప్యూటీ కమిషనర్ కే.ఏ. బి.శాస్త్రి
00000

కరీంనగర్ జిల్లా మొత్తం లో ఉన్నటువంటి 94 వైన్ షాపులకు గాను బుధవారం రోజున 280 అప్లికేషన్ వచ్చాయని ఇప్పటివరకు అనగా నవంబర్ 17 వరకు మొత్తం 488 దరఖాస్తులు వచ్చాయని రాష్ట్ర ఎక్సైజ్ సంయుక్త కమిషనర్ మరియు కరీంనగర్ జిల్లా డిప్యూటీ కమిషనర్ కె.ఏ. బి. శాస్త్రి తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రోజు బుధవారం న కరీంనగర్ అర్బన్ పరిధిలో 41 , కరీంనగర్ రురల్ పరిధిలో 95,జమ్మికుంట స్టేషన్ పరిధిలో 29,హుజురాబాద్ స్టేషన్ పరిధిలో 45 తిమ్మాపూర్ స్టేషన్ పరిధిలో 70 అప్లికేషన్స్ వచ్చాయని, కాగా రేపటితో దరఖాస్తు గడువు ముగుస్తుందని తెలిపారు. అలాగే కావాలని కొందరు టెండర్ ప్రక్రియ ఆగిపోతుందని వదంతులు సృష్టిస్తున్నారని అలాంటి వాటిని నమ్మవద్దని ఎట్టి పరిస్థితుల్లోనూ డిసెంబర్ ఒకటో తారీఖు నుండి కొత్త మద్యం షాపులు ప్రారంభం అవుతాయని తెలిపారు,
దరఖాస్తుదారులు తప్పనిసరిగా చివరి రోజు అవకాశాన్ని ఉపయోగించుకోవాలని, కరీంనగర్ కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన టెండర్ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు, అలాగే ఎస్సి మరియు గౌడ కులాలకు కేటాయించిన షాపులకు సంబంధించి దరఖాస్తు చేసుకోవటానికి కుల ధ్రువీకరణ సర్టిఫికెట్ లేకపోతే ,అండర్ టేకింగ్ ఫారం సమర్పించి కూడా అప్లై చేసుకోవచ్చని తెలిపారు.
ప్రభుత్వ G. O. లో
ఒక వ్యక్తి ఎన్ని షాపులకు అయిన కూడా దరఖాస్తు చేసుకోవచ్చని, ఒకవేళ ఒకటి కంటే ఎక్కువ షాపులు ఒకే వ్యక్తి కి వచ్చినట్లయితే అతని పేరు మీదుగానే ఎన్ని లైసెన్సులు అయిన ఇవ్వొచ్చనే ఉత్తర్వులు G.O. లో పూర్తిగా వివరాలు వచ్చాయని అని,అలాగే ఇతర జిల్లాలో తీసిన DD లు కూడా అంగీకరించబడుతాయని తెలిపారు. ఈ నెల 20వ తేదీ శనివారం రోజున కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియం లో జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో డ్రా తీయటం జరుగుతుందని తెలిపారు.

 

 

Share This Post