జిల్లాలో మద్యం షాపుల కేటాయింపులలో పారదర్శకత పాటించాలని జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ నందు ఎక్సైజ్, సంబంధిత అధికారుల సమక్షంలో జిల్లా కలెక్టర్ డ్రా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలు ప్రకారం జిల్లా జనాభా ప్రాతిపాదికన యస్.సి లకు 10 శాతం, యస్.టి లకు 5 శాతం, గౌడ్స్ కులస్థులకు 15శాతం, కేటాయింపు లు చేయడం జరుగుతుందని అన్నారు. జిల్లాలో 99 మద్యం షాపులు ఉండగా వాటిలో 40 షాపులలో యస్.సి ల కు 3 , యస్.టి లకు 10, గౌడ కులస్తు లకు 27 షాపులకు కేటాయించడం జరుగుతుందని మరో 59 షాపులు జనరల్ కేటాయింపులు చేయడం జరుగుతుందని తేదీ 9నుండి ఎక్సైజ్ కార్యాలయంలో దరఖాస్తులు అంద చేయ వచ్చని కలెక్టర్ ఈ సంధర్బంగా తెలిపారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్, సంక్షేమ అదికారులు శంకర్, దయానంద రాణి, , సి. ఐ. వై శ్రీనివాస్, యస్. ఐ సతీష్, తదితరు లు పాల్గొన్నారు.


