మధిర నియోజకవర్గం ముదిగొండ మండలంలో సోమవారం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్త్ పలు అభివృద్ధి కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ తొ కలిసి ప్రారంభించారు.

ప్రచురణార్థం

ఆగష్టు 02 ఖమ్మం:

దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ పథకాల అమలులో దేశానికే ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. మధిర నియోజకవర్గం ముదిగొండ మండలంలో సోమవారం మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ తొ కలిసి ప్రారంభించారు. ముదిగొండ, చిరుమర్రి, పమ్మి, వల్లభి గ్రామాలలో ఒక్కొక్కటి 22. లక్షల వ్యవయంతో నిర్మించిన రైతువేదికలను, వల్లభిలో వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనాన్ని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వల్లభిలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ. తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆహార సంపదను అందించే రాష్ట్రంగా ఎదిగిందని, గతంలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రంలో 3 కోట్ల టన్నుల వరిని పండించిన రాష్ట్రంగా నిలించిందని మంత్రి తెలిపారు. రాష్ట్ర సంపదను మరింత పెంచి పేద ప్రజలు, రైతాంగం సంక్షేమానికి ఖర్చు చేయాలనే ముఖ్యమంత్రివర్యులు వినూత్న ఆలోచనలతో మనరాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకెళ్తున్నదని మంత్రి తెలిపారు. రైతులందరిని సంఘటితపర్చి ఆధునిక వ్యవసాయ పద్ధతులను అలవర్చేందుకు ప్రతి క్లస్టర్లో రైతువేదికలు ఏర్పాటుకు శ్రీకారం చుట్టి అన్ని క్లస్టర్లలో రైతువేదికలను పూర్తి చేసుకున్నామని మంత్రి తెలిపారు. పురోగతిలో ప్రతి పల్లె ముందుండాలనే సంకల్పంతో రాష్ట్రంలోని 12 వేల 567 గ్రామ పంచాయితీలకు ట్యాంకర్లు, ట్రాక్టర్లు, ట్రాలీలు సమకూర్చుకున్నామని, పరిశు భ్రత, పచ్చదనం లక్ష్యంతో పల్లె ప్రగతిని నిర్వహించుకొని గతంలో ఎన్నడూ లేనివిధంగా డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వ్యాధులను నిర్మూలించగలిగామని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా నిరంతర ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుభీమా, ఆసరా పింఛన్లు, కళ్యాణలక్ష్మి, షాదిముబారక్ పథకాలు కేవలం మన రాష్ట్రంలోనే అమలవుతున్నాయని, ప్రతి ఆరు నెలలకు ఒకసారి చొప్పున రైతుబందు. పథకం క్రింద రాష్ట్రంలో 60 లక్షల మంది రైతులకు 15 వేల కోట్లు రైతుల ఖాతాకు ప్రభుత్వం జమ చేస్తుందన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో 38 లక్షల మందికి వివిధ కేటగిరీల క్రింద ఆసరా పింఛన్లు అందిస్తున్నామన్నారు. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి సురక్షిత మంచినీటిని అందిస్తున్నామని మంత్రి తెలిపారు. వీటితో పాటు బృహత్తర పథకమైన దళితబంధుకు ముఖ్యమంత్రివర్యులు ఈ నెల 16న శ్రీకారం చుట్టనున్నారని, దళితులను సంపన్నులు చేయాలనే సంకల్పంతో ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షలు ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. గత సవంత్సరం 2 లక్షల 96 వేల మందికి 25 వేల లోపు ఋణాలను ప్రభుత్వం మాఫీ చేసిందని, ఈ సంవత్సరం దాదాపు 6 లక్షల మంది రైతాంగానికి 50 వేల లోపు ఋణాలను మాఫీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని, ఆగష్టు 15 నుండి 31 వరకు బ్యాంక్ లో ఇట్టి పైకము జమ అవుతుందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. స్వంత స్థలాలు కలిగిన వారికి ఇండ్లు నిర్మించే కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం త్వరలో చేపట్టబోతున్నట్లు మంత్రి తెలిపారు.

జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజు, శాసనమండలి సభ్యులు బాలసాని లక్ష్మీనారాయణ, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, జిల్లా రైతుబందు సమితి కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, .డి.సి.సి.బి చైర్మన్ కూరాకుల నాగభూషణం, ఆత్మ కమిటీ చైర్మన్ రంగిశెట్టి కోటేశ్వరరావు, ముదిగొండ ఎం.పి.పి సామినేని హరిప్రసాద్, జడ్పీ.టి.సి పసుపులేటి దుర్గ, మండల, జిల్లా రైతుబంధు సమితి సభ్యులు పోట్ల వెంకట ప్రసాద్, శ్రీమతి రాజ్యలక్ష్మీ, ముదిగొండ, చిరుమర్రి, పమ్మి, వల్లభి సర్పంచ్ లు శ్రీమతి మందరపు లక్ష్మి వెంకన్న, కానుగు సుజాత, శ్రీమతి కె. సువార్త, శ్రీమతి పోట్ల కృష్ణకుమారి, ఎం.పి.టి.సిలు యం. దామోదర్, శ్రీమతి బి.జయమ్మ, శ్రీమతి కె.అరుణ, కోయ రమేష్, శ్రీమతి వడ్డెపూడి రోజాని, బి. బిక్షం, జిల్లా వ్యవసాయ శాఖాధికారి. శ్రీమతి విజయనిర్మల, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి విద్యాచందన, పంచాయితీరాజ్ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు జి.వి. చంద్రమౌళి, రెవెన్యూ డివిజనల్ అధికారి రవీంద్రనాథ్, తహశీల్దార్లు, ఎం.పి.డి.ఓ., మండల, గ్రామ స్థాయి అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, ఖమ్మం వారిచే జారీచేయనైనది.

Share This Post