మధిర నియోజకవర్గం సిరిపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తో కలిసి సోమవారం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడు. అజయ్ కుమార్ఆకస్మిక తణిఖీ చేసారు.

ప్రచురణార్ధం

సెప్టెంబరు 06 ఖమ్మం –

విద్యార్థులకు సులువుగా అర్ధమయ్యెరీతిలో విద్యా బోధన ఉండాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడు. అజయ్ కుమార్ ఉపాధ్యాయులను ఆదేశించారు. మధిర నియోజకవర్గం సిరిపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తో కలిసి సోమవారం మంత్రి ఆకస్మిక తణిఖీ చేసారు. తరగతి గదులను సందర్శించి విద్యాబోధన, మధ్యాహ్న భోజనం, విద్యార్థులకు త్రాగునీటి, మరుగుదొడ్ల వసతి తదితర విషయాలపై మంత్రి ఆరాతీసారు. విద్యార్థుల హాజరు శాతాన్ని ప్రధానోపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. తొమ్మిది, పదవ తరగతి విద్యార్థులతో మంత్రి ముచ్చటించారు. అన్ని సబ్జెక్టుల పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్ ఇచ్చారా అని అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనం ఇస్తున్నారా, భోజనం ఎలా ఉంటున్నదని విద్యార్థులను మంత్రి అడిగి తెలుసుకున్నారు. అన్ని సబ్జెక్టులకు సంబంధించిన పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్ అందాయని, మధ్యాహ్న భోజనం పాఠశాలలోనే చేస్తున్నామని విద్యార్థులు తెలిపారు. పాఠశాల తణిఖీ సందర్భంగా తరగతి గదిలో ఫ్లోరింగ్ సరిగా లేకపోవడం పట్ల తక్షణం మరమ్మత్తులు చేయించాలని ప్రధానోపాధ్యాయుని మంత్రి ఆదేశించారు.

జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజు, జిల్లా విద్యాశాఖాధికారి యాదయ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రభాకర్రావు, స్థానిక సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, ఖమ్మం వారిచే జారీచేయనైనది.

Share This Post