మధ్య తరగతి పేదల కళ్ళల్లో వెలుగులు నింపుతున్న కంటి వెలుగు కార్యక్రమం
మనిషి అన్ని అవయవాలకు ప్రాధాన్యత ఇస్తాడు కానీ కంటి చూపుకు అంతగా పట్టించుకోక అలాగే జీవితం గడుపుతుంటాడు. ఇక పల్లెటూర్లో, మధ్య తరగతి పేద వాళ్ళ పరిస్థితి చెప్పనవసరం లేదు. ముదుసలి వాళ్ళు అయ్యాక దవాఖానకు తీసుకు వెళ్లేవారు లేక అయినవారు పట్టించుకోక జీవితం ఇలాగే కోనసాగిస్తుంటారు.
ఇలాంటి సమస్యను గమనించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 18 నుండి రెండవ విడత కంటివేలుగు కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు. గ్రామీణ మున్సిపాలిటీల్లో ఉన్న ఎంతో మంది మధ్య తరగతి, నీరుపేద వారికి ఇంటిదగ్గరే కంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేయించి కంటి చూపు ఇస్తున్నారు.
నారాయణపేట జిల్లాలో సైతం 24 కంటివేలుగు వైద్య బృందాలను ఏర్పాటు చేసి జిల్లా వ్యాప్తంగా 100 పని దినాల్లో 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా కంటి అద్దాలు ఇచ్చేవిధంగా ప్రణాళికలు చేసినారు.
ఈ సందర్భంగా మరికల్ మండలంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు కేంద్రానికి 80 ఏళ్ల వయస్సు గల బాల కిష్టమ్మ తన కొడుకు తో కలిసి వచ్చింది. డాక్టర్లు కంటి పరీక్షలు నిర్వహించగా, తనకు దగ్గర చూపు బాగానే ఉంది కాని కాస్త దూరం ఉండేవేవీ కనపడక ఎవరిని గుర్తించలేక అవస్థలు పడుతున్నట్లు డాక్టరుకు వివరించింది. ఆమెకు పరీక్షలు నిర్వహించిన డాక్టరు (-)2.5 పాయింట్ల ద్రుష్టి లోపం ఉన్నట్టు నిర్దారణ చేశారు. దాదాపు అంధత్వం వచ్చినంతగా ద్రుష్టి లోపం ఉందని ఇదివరకు ఎక్కడ చూపించుకోలేదా అని ప్రశ్నించారు. నన్ను ఎవరు పట్టించుకుంటారు దగ్గరి చూపుతో చిన్న చిన్న పనులు చేసుకుంటున్న కానీ దూరం చూపు లేదని ఆవేదనగా తెలిపింది. డాక్టరు పరీక్షల నిమిత్తము పెట్టిన అద్దాలతో మురిసిపోయింది. ఈ అద్దాలు పెడితే నాకు దూరంలో ఉన్నవి బాగా కనబడుతున్నాయని తెలిపింది. నీకు సరిపడా అద్దాలు 15 రోజుల్లో నీ ఇంటివద్దకే వచ్చి ఇస్తాము అప్పటి వరకు ఈ కంటి చుక్కల మందు కంట్లో కొన్ని రోజులు వేసుకోమని డాక్టరు ఇవ్వడంతో ఆమె సంతోషానికి అవధులు లేవు. త్వరగా అద్దాలు వచ్చేటట్లు చూడు నాయనా కె.సి.ఆర్ కు ఎప్పటికి ఋణ పడి ఉంటాను అని దివించినది.
ఇలాంటి నిరుపేదలు, ముదుసలి వారు ఎంతోమంది కంటివేలుగు కార్యక్రమం ద్వారా పోయిన తమ కంటి చూపు తిరిగి పొందుతున్నారు. అందుకే సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటారు పెద్దలు.