మనఊరు మనబడి, సబ్ సెంటర్ల నిర్మాణ పనులు త్వరగా పూర్తిచేయాలి

మనఊరు మనబడి, సబ్ సెంటర్ల నిర్మాణ పనులు త్వరగా పూర్తిచేయాలి

 

జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్

 

0 0 0 0

 

 

     మనఊరు మనబడి మరియు సబ్ సెంటర్ల భవనాలు (పల్లెదవాఖానాలు) త్వరగా పూర్తిచేసి ప్రారంబానికి సిద్దం చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్. వి. కర్ణన్ సూచించారు.

 

 

       గురువారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో యంపిడిఓలు, యంఈఓలు, ఏఈఓలు, ఎస్.ఎమ్.సి చైర్మన్ లతో మనఊరు మనబడి సబ్ సెంటర్ భవన నిర్మాణ పనులపై జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ సమీక్షించారు.  ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో చేపడుతున్న సబ్ సెంటర్ లు మరియు పాఠశాలల పునరుద్దరణ పనులును పూర్తిచేయాలని,  పాఠశాలలో  పేయింటింగ్ మరియు  లైటింగ్ పనులను పూర్తిచేయాలని, జిల్లాలో ప్రతి మండలంలో మంజూరైన  పాఠశాలలు,  హెల్త్ సబ్ సెంటర్ ల నిర్మాణ పనులకు సంబంధించిన పనులు చేపట్టాలని, మనఊరు మనబడి కార్యక్రమంలో చేపడుతున్న పనులను పూర్తిచేసి జాతీయ విద్యాదినోత్సవం జూన్ 20 లోగా ప్రారంబానికి సిద్దం చేయాలని,  జూన్ 10 నాటికి  హెల్త్ సెంటర్ ల నిర్మాణాలను పూర్తిచేయాలని తెలిపారు.

 

 

       ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రావు, జిల్లా వైద్యాధికారి లలితాదేవి, ఈఈ లు, పబ్లిక్ హెల్త్ అధికారులు,  యంపిడిఓలు, యంపిఓలు,   ప్రదానఉపాద్యాయులు పాల్గోన్నారు

Share This Post