మనఊరు మన బడి పాఠశాలల పనులు మార్చ్ 31 లోగా పూర్తికావాలి

మనఊరు మన బడి పాఠశాలల పనులు మార్చ్ 31 లోగా పూర్తికావాలి

స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్

0 0 0 0

 

         జిల్లాలో మనఊరు మనబడి కార్యక్రమంలో గుర్తించిన పాఠశాలల ఆధునీకరణ పనులను మార్చి 31 లోగా పూర్తిచేసి ప్రారంభానికి సిద్దం చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ తెలిపారు.

 

      బుదవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మనఊరు మనబడి  పనుల ప్రగతిపై సంబంధిత అధికారులతో ఆమె సమీక్షించారు.  ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ,  జిల్లాలో మన ఊరు మనబడి కార్యక్రమంలో బాగంగా గుర్తించబడిన 45 పాఠశాలల్లో మౌళిక వసతుల కల్పనతోపాటు టాయిలెట్లు, ప్రహరిగోడ, కిచెన్ షెడ్ ల నిర్మాణ పనులను, తరగతి గదులలో పెయింటింగ్,  లైట్లు మరియు ఫ్యాన్ల ఏర్పాటు తదితర పనులను యుద్దప్రాతిపదికన పూర్తిచేసి మార్చి 31 నాటికి ప్రారంబోత్సవానికి సిద్దం చేయాలని అన్నారు.

 

      ఈ కార్యక్రమంలో  విద్యాశాఖ అధికారి జనార్దన్ రావు, పంచాయితి రాజ్ ఈఈ శ్రీనివాస్ రావు,, యంఈఓలు,  ఎఈలు పాల్గోన్నారు.

Share This Post