పత్రిక ప్రకటన
తేది 20-3-2023
నాగర్ కర్నూల్ జిల్లా
మన్ననూర్ ఐ.టి.డి.ఏ పరిధిలోని గిరిజన రైతులకు సమీకృత వ్యవసాయం చేయించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టర్ ఛాంబర్ లో వ్యవసాయ అనుబంధ శాఖాధికారులు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులతో సమీకృత వ్యవసాయం, సేంద్రియ వ్యవసాయం పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అచ్ఛంపేట, అమ్రాబాద్, లింగాల, బలమూర్, పదర, కొల్లాపూర్ మండలంలోని గిరిజన రైతులకు సేంద్రియ వ్యవసాయం, సమీకృత వ్యవసాయం చేసేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా చెంచు రైతులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని 5 ఎకరాల కన్నా ఎక్కువ వ్యవసాయ భూమి కలిగి ఉండి తన పొలంలో సేంద్రియ వ్యవసాయం తో పాటు ఉన్న స్థలం లో ఆవులు, గేదెలు, కోళ్లు, వంటి పశుపోషణ తో పాటు పళ్ళ తోటలు సాగు చేసేవిధంగా వారికి ప్రత్యేక శిక్షణ ఇప్పించాలని సూచించారు. ఎలాంటి రసాయన ఎరువులు వాడకుండా సహజమైన నాణ్యమైన విత్తనాలతో సేంద్రియ ఎరువులు మాత్రమే ఉపయోగించి వ్యవసాయం చేసేవిధంగా వ్యవసాయ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. మన్ననూర్ ఐ టి.డి ఏ పరిధిలో 500 మంది రైతులకు సమీకృత, సేంద్రియ వ్యవసాయం వైపు ఆకర్షితులను చేయించాలన్నారు. ముందుగా కొంతమంది ఔత్సాహిక రైతులను ఎంపిక చేసి వారం రోజుల్లో వారి జాబితా ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. 40 మంది రైతులను గుర్తించి వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. శిక్షణ అనంతరం మిగిలిన రైతులను ఎంపిక చేసి సమీకృత వ్యవసాయం చేయించాలన్నారు. తద్వారా గిరిజన చెంచులకు మెరుగైన ఉపాధి కల్పించడం తో పాటు వారు పండించిన సేంద్రియ పంటవల్ల మానవాళికి ఎంతో మేలు జరుగుతుందన్నారు. శిక్షణలో జీవామృతం తయారు చేసే విధానం, వర్మీ కంపోస్టు, సేంద్రియ వ్యవసాయం ఏ విధంగా చేయాలి అనేది శిక్షణ ఇవ్వడం, ప్రత్యక్షంగా వారి చేత చేయించడం వంటి శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇప్పటికే 250 మంది చెంచు రైతులకు ఒక లక్ష రూపాయల చొప్పున వారి ఉపాధి పెంచేందుకు మంజూరు చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా కొంత మంది రైతులకు తిరుమల తిరుపతి దేవస్థానం నుండి ఉచితంగా ఆవులను ఇవ్వడం జరిగిందన్నారు. ఇలాంటి రైతులను గుర్తించి సేంద్రియ, సమీకృత వ్యవసాయం సాగు చేసేవిధంగా చూడాలన్నారు. సంబంధిత మండల వ్యవసాయ శాఖ అధికారులు బాధ్యతలు తీసుకొని చెంచులకు సమీకృత సేంద్రియ వ్యవసాయం చేయించాలని ఆదేశించారు. ప్రత్యక్షంగా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేస్తూ రైతులను ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు ఇస్తూ భాగస్వాములు కావాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో డి.డి. కమిషనరేట్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ హైదరాబాద్ సంధ్యా రాణి , జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు, పశు సంవర్ధక శాఖ అధికారి రమేష్, ఉద్యానవన అధికారి చంద్రశేఖర్, ఏ.ఓ లు, చైల్డ్ కేర్ స్వచ్చంద సంస్థ ప్రతినిధి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.