మన ఊరు మనబడి అభివృద్ధి పనుల వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బి గోపి అన్నారు

ప్రచురణార్థం

మన ఊరు మనబడి అభివృద్ధి పనుల వేగం పెంచాలని
జిల్లా కలెక్టర్ డాక్టర్ బి గోపి అన్నారు

శుక్రవారం రోజున కలెక్టరేట్ లోని కాన్ఫెరెన్స్ హాల్లో
మన ఊరు మనబడి అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై సంబంధిత అధికారులతో కలెక్టర్ రివ్యూ చేసారు

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలో కూడా
అన్ని వసతులు కల్పించి నాణ్యమైన గుణాత్మక విద్య అందించాలనే ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా అధికారులు
పనిచేయాలని అన్నారు

క్షేత్రస్థాయిలో మన ఊరు మనబడి పనులు అనుకున్న లక్ష్యంతో పనులు పూర్తి చేసే విధంగా అడుగులు వేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు

ఇప్పటికీ ఐదారు సార్లు సమావేశాలు నిర్వహించామని.. ప్రతి సమావేశానికి కొత్త సమస్యను ఎత్తుకొని వచ్చి సంబంధిత అధికారులు
కాలయాపన చేస్తున్నారని…అభివృద్ధి పనులు మాత్రం ముందుకు సాగట్లేదని కలెక్టర్ అసహనం వ్యక్తం చేసారు

అభివృద్ధి పనుల తీరుతున్నలను బట్టి ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం జరుగుతుందని… క్షేత్రస్థాయిలో అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వ్యవరించారాధన్నారు

గ్రౌండింగ్ అగ్రిమెంట్ పూర్తయిన పనులు,టెండర్ దశలో ఉన్న పనులు గురించి కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు

మండల స్థాయిలో SNC చైర్మన్,సర్పంచ్, ప్రత్యేక అధికారులు సమావేశం ఏర్పాటు చేసుకొని, సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించుకుంటే
అభివృద్ధి పనులు ముందుకు పోతాయన్నారు

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవిన్యూ శ్రీవత్స కోట, జిల్లా విద్యాశాఖ అధికారి వాసంతి,
డి ఆర్ డి ఏ, పి డి సంపత్ రావు డిపిఓ సంబంధిత ప్రత్యేక అధికారులు ఎంపీడీవోలు ఎన్ఆర్ఈజీఎస్ ఏపీవోలు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు

Share This Post