మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పనపై చేపట్టిన పనులపై నిర్లక్ష్యం తగదని జిల్లా కలెక్టర్ డాక్టర్ బి గోపి అధికారులు హెచ్చరించారు

ప్రచురణార్థం
21.01.2023
మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పనపై చేపట్టిన పనులపై నిర్లక్ష్యం తగదని జిల్లా కలెక్టర్ డాక్టర్ బి గోపి అధికారులు హెచ్చరించారు
శనివారం రోజున జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ హాల్లో మన ఊరు మనబడి కార్యక్రమ పనుల పురోగతిపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ టెండర్స్ అగ్రిమెంట్స్ అని కాలయాపన చేస్తూ మన ఊరు మన బడి నిర్మాణ పనులను మంద కోడిగా సాగిన యెడల ఉపేక్షించేది లేదని అన్నారు గంగదేవిపల్లి మోడల్ గ్రామపంచాయతీగా పేరుగాంచిందని అటువంటి పంచాయతీలో మన ఊరు మనబడి పనులు సరిగా జరగకపోవడానికి కారణాలు తెలియపరచాలని సంబంధిత ప్రత్యేక అధికారి పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డీఈలు ఏఈలు సమస్యను పరిష్కరించాలన్నారు
మండల స్థాయిలో మన ఊరు మనబడి పనుల పురోగతిపై సమావేశం నిర్వహించుకుని సమావేశంలో పేర్కొన్న అంశాలను రికార్డ్ చేసి నాకు అందించాలని తద్వారా తదుపరి చర్యలకై ముందుకు పోవడం జరుగుతుందని చెప్పారు
జిల్లా పాలన ప్రభుత్వ అభివృద్ధి పథకాలను కాంక్షిస్తూ సమావేశాలు నిర్వహిస్తున్నామని ఈరోజు సమావేశానికి హాజరుకాని అధికారులకు తాకీదులు జారీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.టెండర్ అయిపోయి అగ్రిమెంట్ కంప్లీట్ అయినవి పనులు వెంబడే ప్రారంభించాలని అన్నారు కిచెన్ సేడ్స్ కాంపౌండ్ వాల్స్ టాయిలెట్స్ ఎన్ఆర్ఈజీఎస్ కింద చేపట్టిన పనులు ఎంబిగ్రౌండింగ్ ఎఫ్ బి ఓ జనరేట్ గురించి సంబంధిత ఎంపీడీవోలుని అడిగి తెలుసుకున్నారు మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా పనుల పురోగతిపై ఇప్పటికే పలుమార్లు సమావేశాలు నిర్వహించడం జరిగిందని గత సమావేశాలకు ఈ సమావేశానికి పనుల పురోగతి కొంచెం వేగం పుంజుకుందని కష్టించి పనిచేసే సాధ్యమైంది తొందరగా పూర్తిచేయాలనిఅధికారులకు కలెక్టర్ హితబోధ చేశారువరంగల్ జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడం జరుగుతుందని ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో కంటి వెలుగు కార్యక్రమాన్ని సందర్శించాలని కలెక్టర్ చెప్పారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ అశ్విని తానాజీ వాకాడే అదనపు కలెక్టర్ రెవెన్యూ శ్రీవత్సవ కోట జిల్లా విద్యాశాఖ అధికారి వాసంతి
డిపిఓ కల్పన జిల్లా పరిషత్ సీఈవో సంబంధిత ప్రత్యేక అధికారులు పంచాయతీరాజ్ ఏఈలు
డి ఇ లు ఎంపీడీవోలు ఏంఈవోలు పాల్గొన్నారు

Share This Post