మన ఊరు మనబడి కార్యక్రమం కింద ఎంపికైన పాఠశాలలను మార్చి నాటికి పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని తెలంగాణ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ ఇన్ఫ స్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి అన్నారు.

ప్రచురణార్థం

మన ఊరు మనబడి కార్యక్రమం కింద ఎంపికైన పాఠశాలలను మార్చి నాటికి పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని తెలంగాణ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ ఇన్ఫ స్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి అన్నారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఎంఈఓ లు, ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ఇప్పటివరకు మన ఊరు మనబడి కార్యక్రమం ద్వారా సూచించిన పనులను త్వరితగతిన పూర్తి చేయుటకు తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సూర్యాపేట జిల్లాలో మొదటి పేస్ కింద 329 పాఠశాలలు ఎంపిక చేయగా పైలట్ ప్రాజెక్టు కింద ఎంపికైన 56 మోడల్ స్కూలలొ4 ప్రారంభం కాగా 6 ప్రారంభనానికి సిద్ధంగా ఉన్నా వాటిని స్థానిక ప్రజాప్రతినిధులతో మాట్లాడి ప్రారంభోత్సవాలకు సిద్ధం చేసుకోవాలని, మిగిలిన 46 మోడల్ స్కూల్ లను మార్చి 15 నాటికి సిద్ధం చేసేలా చర్యలు తీసుకోవాలని చైర్మన్ తెలిపారు. పాఠశాలలలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులు సక్రమంగా జరిగేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు చైర్మన్ ఆదేశించారు. మండలాల వారీగా మన ఊరు మనబడి కార్యక్రమం ద్వారా జరుగుతున్న పనులను ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షించారు. హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గాలలో పనులు మందకొండ సాగుతున్నాయని వాటిని వేగవంతం చేసి సిద్ధం చేయాలని చైర్మన్ తెలిపారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం మన ఊరు మన బడి అని ఇంజనీరింగ్ అధికారులు మన ఊరు మనబడి కార్యక్రమాలు త్వరగా పూర్తయ్యేలా తగు చర్యలు తీసుకోవాలని చైర్మన్ పేర్కొన్నారు. మార్చి 15 నాటికల్లా మిగిలి ఉన్న 46 మోడల్ స్కూల్ లను ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని పనుల యొక్క పురోగతిని వారం రోజులలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలుసుకుంటానని, పనులు వేగవంతం చేయాలని చైర్మన్ అన్నారు. ఈ కార్యక్రమంలో లోకల్ బాడీస్ జిల్లా అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత కేశవ్, డి ఈ ఓ అశోక్, ఇంజనీరింగ్ అధికారి రమేష్, జిల్లా పంచాయతీరాజ్ ఈఈ టి శ్రీనివాస్ రెడ్డి, ఎంఈఓ లు ఇంజనీరింగ్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
———————————————–

Share This Post