పత్రిక ప్రకటన తేది : 20-01-2023
మన ఊరు మనబడి కార్యక్రమం కింద చేపట్టిన పాఠశాలలో మరుగుదొడ్లు నిర్మాణము ,అదనపు గదులు, త్రాగునీరు , ఎలక్ట్రిసిటీ పనులు వెంటనే పూర్తిచేయాలని అధికారులకు ఆదేశించారు.
శుక్రవారం మానవపాడు మండలం అమరవాయి గ్రామం ప్రాథమిక పాఠశాలను తనికి చేశారు. పూర్తి అయి న పనులను పరిశీలించారు. టాయిలెట్స్ లో టైల్స్ వేసి, పైప్ లైన్ వేయాలని, ఎన్ ఆర్ ఇ జి ఎస్ కింద పనులన్నీ పూర్తి చేయాలని, కాంపౌండ్ లో ప్లే గ్రౌండ్ ఏర్పాటు చేసి మొక్కలు నటాలన్నారు .
అనంతరం గోకులం పాడు గ్రామ పంచాయతి కార్యాలయం లో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని తనికి చేశారు. శిబిరానికి వచ్చిన వారితో మాట్లాడి వారికీ అందుతున్న వైద్య పరీక్షల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. దగ్గరుండి కంటి పరీక్షలు చేయిoచారు. శిబిరానికి వచ్చే వారందరికి అన్ని వసతులు కలిపించాలని అధికారులకు ఆదేశించారు.
ఉండవెల్లి మండలం చిన్న ఆముదాలపాడు గ్రామ పంచాయతి కార్యాలయం లో కంటి వెలుగు శిబిరాన్ని తనికి చేశారు . వైద్య బృందం తో మాట్లాడి ఎంత మంది వచ్చారు, ఎంత మందికి కళ్ళద్దాలు పంపిణి చేశారు, ఎంత జనాభా ఉంది , ఎన్ని రోజులు క్యాంపు నిర్వహిస్తున్నారు అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. 18 సంవత్సరాలు పై బడిన వారందరూ కంటి పరీక్షలు నిర్వహించుకొని వారి దృష్టి లోపాలను దూరం చేసుకోవాలని , గ్రామ ప్రజలందరూ కంటి వెలుగు శిబిరానికి వచ్చి పరీక్షలు చేసుకునేలా వారికీ అవగాహన కలిపించాలని అధికారులకు ఆదేశించారు.
ఉండవెల్లి ప్రాథమిక పాఠశాలను తనికి చేశారు. బాలికలకు, బాలురకు వేరువేరుగా నిర్మించిన బాత్ రుములను పరిశీలించారు. కలరింగ్, పైప్ లైన్ వేయాలని, పాఠశాల గ్రౌండ్ లో ఎర్రమట్టి వేసి మొక్కలు నాటించాలని అధికారులకు ఆదేశించారు.
ఈ కార్యాక్రమం లో ఉండవెల్లి తహసిల్దారు బద్రప్ప, ఎం ఇ ఓ శివ ప్రసాద్ , సర్పంచు సురేఖ, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
————————————————————————————
జిల్లా పౌర సంబంధాల అధికారి జోగులాంబ గద్వాల గారిచే జారి చేయబడినది.