మన ఊరు మన బడి పాఠశాలల అభివృద్ధి పనులపై హైదరాబాదు నుండి విద్యాశాఖ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విద్యాశాఖ సెక్రటరీ వాకాటి కరుణ , సంచాలకులు దేవసేన తదితర ఉన్నతాధికారులతో కలిసి జిల్లా కలెక్టర్లతో సమీక్షించారు.*
*మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ* రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచన నుండి వచ్చిన ప్రతిష్టాత్మకమైన మన ఊరు మనబడి కార్యక్రమం అన్నారు. నిధులకు కొరత లేదని పాఠశాలలలో నాణ్యత మైన పనులు చేపట్టి క్రీడా ప్రాంగణం తో పాటు పాఠశాలను అన్ని సౌకర్యాలతో అందంగా తీర్చిదిద్దాలన్నారు. అవసరమైన చోట గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి పాఠశాలకు సోలార్ విద్యుత్ కనెక్షన్ ఉండి తీరాలన్నారు. పాఠశాలల పరిశుభ్రత గ్రామపంచాయతీ బాధ్యత తీసు కొన్ని ఎలా చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలియజేశారు. పనులు పూర్తయిన వాటి బిల్లులు మంజూరయ్యే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం కలర్స్, బ్లాక్ బోర్డ్స్, కిచెన్ షెడ్, గ్రీనరీ, డైనింగ్ హాల్, తదితర 12 రకాల పనుల పూర్తిగా నాణ్యత ప్రమాణాలతో చేయాలని ఆదేశించారు.
సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తి చేయుటకు పకడ్బదీగా చర్యలు తీసుకోవాలని మంత్రి తెలిపారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖుష్బూ గుప్తా , డిఈఓ బిక్షపతి, పి.అర్.,అర్ ఆండ్ బి ఈ ఈ లు పాల్గొన్నారు.