మన ఊరు-మనబడి, మన బస్తీ మన బడి ద్వారా ప్రభుత్వ పాఠశాలలను అన్ని హంగులతో తీర్చిదిద్ది కార్పోరేట్ స్థాయి ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన జరుగుచున్నదనే విషయాన్ని విస్తృతంగా అవగాహన కల్పించి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు నమోదు సంఖ్యను మరింత పెంచాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ విద్యా శాఖ అధికారులను, స్థానిక ప్రజాప్రతినిధులకు సూచించారు.

ప్రచురణార్ధం

మే 11 ఖమ్మం –

మన ఊరు-మనబడి, మన బస్తీ మన బడి ద్వారా ప్రభుత్వ పాఠశాలలను అన్ని హంగులతో తీర్చిదిద్ది కార్పోరేట్ స్థాయి ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన జరుగుచున్నదనే విషయాన్ని విస్తృతంగా అవగాహన కల్పించి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు నమోదు సంఖ్యను మరింత పెంచాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ విద్యా శాఖ అధికారులను, స్థానిక ప్రజాప్రతినిధులకు సూచించారు. బుధవారం సత్తుపల్లి నియోజకవర్గం: పెనుబల్లి మండలం టేకులపల్లి ప్రైమరీ హైస్కూల్ వి.యం. బంజర ప్రభుత్వ ఉన్నత పాఠశాల, లంకాసాగర్, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను సందర్శించి మన ఊరు- మనబడి కింద చేపట్టనున్న పనులను కలెక్టర్ అంచనాల ప్రకారం పరిశీలించి ఇంజనీరింగ్ అధికారులకు పలు ఆదేశాలు చేసారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను మరింత పెంచాలని, తదనుగుణంగా ఉపాధ్యాయులు, స్థానిక ప్రజాప్రతినిధులు గ్రామాలలో ప్రతి ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులకు తగు అవగాహన కల్పించి ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న సౌకర్యాల పట్ల పూర్తి అవగాహన కల్పించి విద్యార్థులు నమోదు. శాతాన్ని పెంచాలని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్స్ అందించడంతో పాటు పౌష్టికాహారంతో మధ్యహ్న భోజనాన్ని అందిస్తూ ఆంగ్ల మాధ్యమంలో కూడా విద్యాబోధన చేస్తున్నామనే విషయాన్ని తల్లిదండ్రులకు తెలియచేయాలని కలెక్టర్ అన్నారు. మన ఊరు మన బడి కింద ఇప్పటికే గుర్తించిన పనుల అంచనాలను మరొకసారి సరిచూసుకొని విద్యార్థుల సంఖ్యను బట్టి వారి అవసరాలకనుగుణంగా కిచెన్ షెడ్లు, డైనింగ్ హాల్స్, మరుగుదొడ్లు, ప్రహరీ గోడలు, క్రీడా సౌకర్యాల కల్పన పనులను చేపట్టి పాఠశాలలు పున: ప్రారంభం అయ్యేలోగా పూర్తి చేయాలని ఇంజనీరింగ్, విద్యా శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అడవి మల్లెల ప్రభుత్వ పాఠశాలలో మూడెకరాల విస్తీర్ణంలో గల స్థలంలో పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేయడంతో పాటు విద్యార్థులకు అవసరమైన క్రీడా మైదానం పనులను చేపట్టాలని కలెక్టర్ సూచించారు.

అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్, పంచాయితీరాజ్ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు చంద్రమౌళి, తహశీల్దారు. రమాదేవి, ఎం.పి.డి.ఓ మహాలక్ష్మి, మండల విద్యాశాఖాధికారి రాములు, ఆయా గ్రామాల సర్పంచ్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post