మన ఊరు – మన బడికి పాఠశాలలు ప్రారంభానికి సిద్దంగా ఉంచాలి జిల్లా అధికారులతో సమీక్ష సమావేశంలో కలెక్టర్ హరీశ్

పత్రిక ప్రకటన

తేదీ : 28–05–2022

మన ఊరు – మన బడికి పాఠశాలలు  ప్రారంభానికి సిద్దంగా ఉంచాలి

జిల్లా అధికారులతో సమీక్ష సమావేశంలో కలెక్టర్ హరీశ్

మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలో మన ఊరు – మన బడి కార్యక్రమానికి పది రోజుల్లో కనీసం 30  పాఠశాలలను ప్రారంభోత్సవానికి సిద్దంగా ఉంచాలని ఈ విషయంలో అధికారులు పనులను వేగవంతం చేయాలని  జిల్లా కలెక్టర్ హరీశ్ అన్నారు. శనివారం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మన ఊరు – మన బడి కార్యక్రమం ప్రగతిపై జిల్లా విద్యాశాఖ అధికారిణి విజయకుమారితో కలిసి జిల్లాలోని 15 మండలాల ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీలు, ఏఈలు, డీఈఈలు, ఈఈలతో కలెక్టర్ హరీశ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హరీశ్ మాట్లాడుతూ  జిల్లాలో ఎంపిక చేసిన 176 పాఠశాల్లో  గ్రౌండింగ్ కార్యక్రమం వెంటనే పూర్తి చేసి  వచ్చే పది రోజుల్లో మండలానికి రెండు పాఠశాలల చొప్పున కనీసం 30 పాఠశాలల్లో పనులన్నీ పూర్తి చేసి  ప్రారంభానికి సిద్ధంగా ఉంచాలని కలెక్టర్ అధికారులకు తెలిపారు. మన ఊరు –  మన బడి కార్యక్రమం కింద ఎంపిక చేసిన పాఠశాలను సివిల్ వర్క్, పెయింటింగ్, మైనర్ రిపేరింగ్, మరుగుదొడ్లు వంటి మొదలైన పనులను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.  ఈ మేరకు మొదటి దశలో ఉన్న పాఠశాలలకు పరిపాలన సంబంధిత మంజూరి పూర్తయిందని అందుకు సంబంధించిన రివాల్వింగ్ ఫండ్ కూడా విడుదల ప్రక్రియ ప్రధానమైందని కలెక్టర్ తెలిపారు. మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలో  176 పాఠశాలలను ఎంపిక చేయడం జరిగిందని వాటిలో పనులు ప్రారంభమయ్యాయని పనులను వేగవంతం చేయడంతో పాటు జూన్ 10వ తేదీ నాటికి మండలానికి 2 పాఠశాలల్లో  అన్ని పనులు పూర్తిచేయాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో డీఈవో విజయకుమారి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

 

Share This Post