“మన ఊరు – మన బడి” కార్యక్రమంపై సమీక్ష సమావేశం : జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

పత్రికా ప్రకటన.    తేది:07.06.2022, వనపర్తి.

“మన ఊరు – మన బడి” కార్యక్రమం కింద మొదటి విడత ఎంపికైన పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు జాప్యం లేకుండా పనులు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష  సంబంధిత అధికారులకు ఆదేశించారు.
మంగళవారం నూతన సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయ సముదాయంలో వివిధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ పాఠశాలల పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వనపర్తి జిల్లాలో 183 పాఠశాలలను గుర్తించడం జరిగిందని, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో “మన ఊరు- మన బడి” కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినట్లు ఆమె తెలిపారు. ఒక్కో పాఠశాలకు రూ.30 లక్షల లోపు పనులకు గ్రౌండింగ్ చేస్తున్నట్లు, ఈ నెల 30వ. తేది లోపు పనులు పూర్తి చేయాలని ఆమె సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) ఆశిష్  సంగ్వాన్, (రెవెన్యూ) డి. వేణుగోపాల్, పంచాయతీ రాజ్ ఈ ఈ మల్లయ్య డీఈవో రవీందర్, డి ఆర్ డి ఓ నరసింహులు, ఎమ్మార్వో రాజేందర్ గౌడ్, పంచాయతీ రాజ్ ఇంజనీర్లు, విద్యాశాఖ ప్రత్యేక అధికారులు, ఎం.ఈ.ఓ.లు తదితరులు పాల్గొన్నారు.
—————-
జిల్లా పౌర సంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.

Share This Post