మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా కల్లూరు మండల కేంద్రంలోని మండల ప్రజాపరిషత్ ప్రాధమిక పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో చేపడుతున్న అభివృద్ధి పనులను బుధవారం జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేశారు.

ప్రచురణార్థం

ఖమ్మం, జూలై 27:

మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా కల్లూరు మండల కేంద్రంలోని మండల ప్రజాపరిషత్ ప్రాధమిక పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో చేపడుతున్న అభివృద్ధి పనులను బుధవారం జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పనుల్లో వేగం పెంచి, త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. ప్రాధమిక పాఠశాలలో టాయిలెట్ బ్లాక్, కిచెన్ షెడ్, ఎలక్ట్రిసిటి, త్రాగు నీరు, ఇతర మరమ్మత్తు పనులు చేపట్టినట్లు, ఉన్నత పాఠశాలలో మరమ్మత్తులు, తలుపులు, కిటికీల ఏర్పాటు పనులు చేపట్టినట్టు అధికారులు తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలు ఎక్కడ వున్నవి అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో గదులు ఉపయోగంలో లేక ఖాళీగా వుండడం చూసిన కలెక్టర్ అంగన్వాడి కేంద్రాలకు గదులు కేటాయించి, పాఠశాల ప్రాంగణంలోనే నిర్వహించాలన్నారు. ఉన్నత పాఠశాలలో డ్యూయల్ డేస్కులు ఉపయోగంలో లేకపోవడం గమనించి, వాటిని అవసరం వున్న పాఠశాలలకు తరలించాలన్నారు. విద్యార్థుల హాజరును అడిగి తెలుసుకున్నారు. ప్రాంగణం చదును పనులను పరిశీలించారు. నీరు నిల్వకుండా చూడాలన్నారు. పాఠశాలల లోపల, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు.

అనంతరం కలెక్టర్ ఖాన్ ఖాన్ పేట గ్రామంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పురోగతిని పరిశీలించారు. 6 బ్లాకుల్లో జి+2 గా, ఒక్కో బ్లాకులో 16 ఇండ్ల నిర్మాణాలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. ఎలక్ట్రిసిటీ, కలరింగ్, నీటి సరఫరా, సెప్టిక్ ట్యాంకు నిర్మాణాల పనులు ఇంకనూ జరగాల్సి ఉన్నట్లు ఆయన అన్నారు. పనుల్లో వేగం పెంచి, 15 రోజుల్లో పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

కలెక్టర్ పర్యటన సందర్భంగా కల్లూరు ఆర్డివో సూర్యనారాయణ, పిఆర్ ఇఇ చంద్రమౌళి, టిడబ్ల్యు ఇఇ నానాజీ, తహసిల్దార్ బాబ్జి ప్రసాద్, ఎంపిడివో రవి కుమార్, కల్లూరు గ్రామ సర్పంచ్ రఘు, పంచాయితి కార్యదర్శి కృష్ణా రావు, అధికారులు తదితరులు వున్నారు.

Share This Post