మన ఊరు-మన బడి కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని, శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య అన్నారు

ప్రచురణార్ధం

ఏప్రిల్ 23 ఖమ్మం

మన ఊరు-మన బడి కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని, ఆంగ్ల మాధ్యమిక విద్యను నిరుపేద కుటుంబంలో పుట్టిన పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్యకు దీటుగా అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వర్యులు కె.చంద్రశేఖర్రావు సారధ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రేవేశ పెట్టిన మన ఊరు మన బడి కార్యక్రమం తోనే సాధ్యమవుతుంది అని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. శనివారం తల్లాడ మండలం మల్లారం, రెడ్డిగూడెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో జిల్లా కలెక్టర్ వి.పి గౌతమ్ తో కలిసి మన ఊరు మన బడి కార్యక్రమలను శాసనసభ్యులు ప్రారంభించారు.

జిల్లా కలెక్టర్ క్రీ.వి.పి. గౌతమ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు- మన బడి కార్యక్రమలను అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలలో 1 వ తరగతి నుండి 8 వ తరగతి వరకు ఇంగ్లీషు మీడియం ప్రవేశ పెట్టడం జరుగుతుందని, తరువాత 9, 10 తరలగతులను కూడా ఇంగ్లీషు మీడియంలో విధ్యా బోధన ఉంటుందన్నారు.. ప్రేయివేటు పాఠశాలల్లో కంటే ప్రభుత్వ పాఠశాలల్లో నిపుణులైన మెరిట్ పద్ధతిన నియామకమైన ఉపాధ్యాయులు ఉంటారని మన రాష్ట్ర ప్రభుత్వం కార్పోరేట్ విద్యాసంస్థలకు దీటుగా ఉండేలా పిల్లల చదువులు, వారి భావిష్యత్ను దృష్టిలో ఉంచుకొని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చేపట్టిన ఈ మంచి కార్యక్రమంను అందరూ సద్వినియోగం చేసుకొని పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్తోనే చదివించుకునేలా కృషి చేయాలని అన్నారు. అనంతరం తల్లాడ మండలం కేంద్రంలో నిరుపేద ముస్లిం కుటుంబలకు పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా (తోపా) దుస్తులను తల్లాడ మండలం మల్లారం రైతు వేదికలో శాసనసభ్యులు వెంకటవీరయ్య జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తో కలిసి పంపిణీ చేశారు. నిరుపేద ముస్లిం కుటుంబంలకు ముఖ్యమంత్రి పర్యులు అన్ని మాత విశ్వాసాలను గౌరవించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పండుగలను పురస్కరించుకొని దుస్తులు పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. అనంతరం తల్లాడ మండలంలో 20 మంది లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి – షాధిముబారక్ చెక్కులు పంపిణీ చేసారు.

కార్యక్రమంలో డి.సి.ఎం.ఎస్ చైర్మన్ రాయల వెంకట శేషగిరిరావు, ఎంపీపీ దౌడ్డ శ్రీనివాసరావు, రైతు బంధు మండల అధ్యక్షుడు దుగ్గిదేవర వెంకటలాల్, వైదా వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ ధూపాటి భద్ర రాజు, మల్లారం సర్పంచ్ దుగ్గిదేవర సామ్రాజ్యం, రెడ్డిగూడెం గ్రామ సర్పంచ్ బద్దం నిర్మల, కల్లూరు ఆర్.డి.ఓ సూర్య నారాయణ, జిల్లా విద్యా శాఖాధికారి యాదయ్య, తహశీల్దారు గంట శ్రీలత, ఎం.పి.డి.ఓ రవీంద్ర రెడ్డి, ఎం.పి.ఓ కొండపల్లి శ్రీదేవి, ఎం.ఇ.ఓ. దామోదర్ ప్రసాద్, ఆత్మ డైరక్టర్ కేతినేని చలపతిరావు తదితరులు పాల్గొన్నారు.

Share This Post