మన ఊరు మన బడి కార్యక్రమంలో అందరు భాగస్వాములు కావాలి* *అదనపు కలెక్టర్ సంధ్య రాణీ

మన ఊరు మన బడి కార్యక్రమంలో అందరు భాగస్వాములు కావాలి*  *అదనపు కలెక్టర్ సంధ్య రాణీ

*ప్రెస్ రిలీజ్*

*హనుమకొండ*

*మే 03*

*మన ఊరు మన బడి కార్యక్రమంలో అందరు భాగస్వాములు కావాలి*

*అదనపు కలెక్టర్ సంధ్య రాణీ*

మన ఊరు మన బడి కార్యక్రమంలో అందరు భాగస్వాములు కావాలన్నారు అదనపు కలెక్టర్ సంధ్య రాణీ శుక్రవారం నాడు హనుమకొండ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మన ఊరు మన బడి ప్రత్యేక అధికారులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటికే గుర్తించబడిన ( 176 ) వివిధ పాఠశాలలో అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని పాఠశాలలో మరుగు దొడ్లు, త్రాగు నీరు, విద్యుత్, క్రీడా ప్రాంగణాలు, నర్సరీలు వివిధ (12) రకాల అభివృద్ధి పనులు వెంటనే పూర్తి చేయాలన్నారు.

పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్స్ వంద శాతం పెంచడానికి అర్బన్,గ్రామీణ ప్రాంతాల స్వచ్చంధ సంస్థలు, స్థానిక నాయకుల సహకారంతో, అధికారులు, సంబంధిత శాఖల సిబ్బంది సమన్వయంతో పనిచేయాలన్నారు.

పాఠశాలలో ఆడ పిల్లలకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

వారికి వివాహ వయస్సు వచ్చిన తరువాతే వివాహం చేసే విధంగా వారి తల్లీ తండ్రులకు అవగాహన కల్పించాలన్నారు.

మన ఊరు మన బడి ప్రత్యేక అధికారులు సంబంధిత శాఖల అధికారులతో కలిసి సమన్వయంతో పనిచేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో డిఈఓ రంగయ్య నాయుడు, జిల్లా అధికారులు సంబంధిత శాఖల సిబ్బంది పాల్గొన్నారు.       

Share This Post