మన ఊరు – మన బడి కార్యక్రమంలో భాగంగా మొదటి విడతలో ఎంపికైన పాఠశాలలన్నింటిని వెంటనే గ్రౌండింగ్ చేసి పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ నిఖిల…

మన ఊరు – మన బడి కార్యక్రమంలో భాగంగా మొదటి విడతలో ఎంపికైన పాఠశాలలన్నింటిని వెంటనే గ్రౌండింగ్ చేసి పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ నిఖిల ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.

శుక్రవారం కలెక్టర్ కార్యాలయం లోని కాన్ఫరెన్స్ హాల్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇంజనీరింగ్ అధికారులు, యం ఇ ఓ లు, మండల స్పెషల్ ఆఫీసర్లతో మన ఊరు – మన బడి పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, పాఠశాలల ఆధునికరణకు రూ. 30 లక్షలకు పైబడిన ఖర్చులకు వెంటనే టెండర్ లు పిలవాలని సూచించారు. అలాగే రూ. 30 లక్షలకు తక్కువ ఖర్చు గల పనులకు వెంటనే గ్రౌండింగ్ చేసి 20 రోజులలో పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. పనులలో నిర్లక్ష్యం వహించకుండా సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో జిల్లా విద్యా శాఖ అధికారి రేణుక దేవి, జిల్లా రెవిన్యూ అధికారి విజయ కుమారి, టీటీడీఓ కోటాజీ డిఇ లు, ఎఇ లు, యంఇఓ లు, మండల స్పెషల్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.

Share This Post