మన ఊరు మన బడి కార్యక్రమం మరియు వైద్య సేవలపై వేరువేరుగా వీడియో కాన్ఫరెన్స్…….


పత్రికా ప్రకటన
సిద్దిపేట 2 సోమవారం.

మన ఊరు మన బడి కార్యక్రమం ద్వారా ఎంపిక చేసిన పాఠశాలల్లో అభివృద్ధి పనులను పాఠశాలలు పున ప్రారంభంలోగా పూర్తిచేయాలని రాష్ట్ర ఆర్థిక మరియు వైద్యఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు మరియు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జిల్లా అధికారులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశించారు. సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టరు మరియు సంబంధిత శాఖల జిల్లా అధికారులతో మన ఊరు మన బడి కార్యక్రమం ద్వారా ఎంపిక చేసిన పాఠశాలల అభివృద్ధి కార్యక్రమాల ప్రగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో సౌకర్యాలను పెంచి, సుందరంగా తీర్చిదిద్ది అత్యధిక సంఖ్యలో విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలకు ఆకర్షించేలా 7300 కోట్ల రూపాయలతో చేపట్టిన మన ఊరు మన బడి కార్యక్రమం ద్వారా ఎంపికైన పాఠశాలలను పాఠశాల ప్రధానోపాధ్యాయులు, అధికారులు మరియు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు క్షుణ్నంగా పరిశీలించి పాఠశాలల అభివృద్ధికి అవసరమైన పనులను గుర్తించి వాటికి జిల్లా కలెక్టర్ ద్వారా పరిపాలన అనుమతులు పొంది వెంటనే పనులు ప్రారంభించి వేసవి సెలవులు ముగిసి పాఠశాలలు పున ప్రారంభం అయ్యేలోగా పనులను పూర్తి చేయాలని అన్నారు. అనవసరము నిర్మాణాలకు నిధులను వృధా చేయకుండా అత్యవసరమైన పనులను పూర్తి చేయాలని అన్నారు. డైనింగ్ హాల్ కొరకు కవర్ షెడ్లను నిర్మించాలని అన్నారు. ప్రతి పాఠశాలలో ముఖ్యంగా త్రాగునీరు, మరుగుదొడ్లు, అవసరమైనన్ని తరగతి గదులు, శుభ్రమైన పరిసరాలు, సౌకర్యవంతమైన ఫర్నిచర్, ఆకర్షణీయమైన పెయింటింగ్స్ ఉండేలా చూడాలని అన్నారు. జిల్లా కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ చూపి జిల్లా అదనపు కలెక్టర్ లు మరియు ఇతర సీనియర్ అధికారులతో కలిసి క్షేత్రస్థాయి పర్యటన ద్వారా పాఠశాలల్లో మౌలిక వసతులను గమనించాలని, అభివృద్ధి పనులు వేగంగా జరిగేలా చూడాలని అన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా అదనపు కలెక్టర్ ముజామిల్ ఖాన్, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి, విద్యాశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

# ప్రభుత్వ ఆస్పత్రిలో సేవలపై ప్రజలకు నమ్మకం కలిగేలా ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్య సేవలు అందేలా చూడాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మరియు ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఆదేశించారు. సోమవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తో కలిసి రాష్ట్ర మంత్రి హరీష్ రావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వైద్యఆరోగ్యసేవల పై జిల్లా కలెక్టర్ మరియు వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వంద శాతం ప్రసవాలు ఆస్పత్రిలోనే నిర్వహించాలని అన్నారు. బిడ్డ పుట్టిన గంటలోపే తల్లిపాలు తాగితే పిల్లలు శారీరకంగా మానసికంగా ఆరోగ్యవంతంగా అడుగుతారని అన్నారు. మహిళలు గర్భం దాల్చిన వెంటనే ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు ప్రసవం జరిగే వరకు ప్రతినెల చెకప్ లు చేయించాలని అన్నారు. కెసిఆర్ కిట్ పథక ప్రారంభానికి ముందు ప్రభుత్వ ఆసుపత్రిలో 30 శాతం ఉన్న డెలివరీలు కెసిఆర్ కిట్ అనంతరం అనంతరం 56 శాతానికి పెరిగాయని అన్నారు. బిపి, షుగర్ తదితర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారి కోసం ప్రభుత్వం ఉచితంగా ఇంటివద్దనే మందులను ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టిందని ప్రతి మూడు నెలలకు ఒకసారి పీహెచ్సీలలో వారిని పరీక్షించి రెగ్యులర్గా మందులను అందించాలని అన్నారు. ప్రతి పీహెచ్సీ కాయకల్ప, లక్ష్య తదితర అవార్డులు వచ్చేలా వైద్య సేవలు అందించాలని అన్నారు. తద్వారా ఆస్పత్రులకు ప్రత్యేక నిధులు వస్తాయని తెలిపారు. టీబీ వ్యాధి గ్రస్తులను గుర్తించి వారికి ప్రత్యేక చికిత్స అందించి సాధారణ స్థితికి చేరుకునేలా కృషి చేయాలని అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులలో ప్రస్తుతం ఉన్న సానిటేషన్ మరియు డైట్ కాంట్రాక్టులను రద్దు చేస్తున్నామని నూతనంగా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో టెండర్లను పిలిచి స్థానికంగా శానిటేషన్ మరియు డైట్ ఏజెన్సీలను ఎంపిక చేయాలని అన్నారు. ప్రభుత్వ వైద్యులు, వైద్య సిబ్బంది జవాబుదారితనం పెరిగేలా అన్ని పీహెచ్సీలు, సిఎస్సి లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుల పోస్టులు ఖాళీలు ఉండకుండా రెగ్యులర్ డాక్టర్ల నియమించేలోపు తాత్కాలిక పద్ధతిలో నియమించుకోవాలని అన్నారు. లేకపోతే అందుబాటులో ఉన్న ఆర్బిఎస్కె మరియు పల్లె దవాఖానాల వైద్యుల సేవలను ఉపయోగించుకోవాలని అన్నారు. కొన్ని రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్నందున అనుమతించిన అన్ని ఏజ్ ల వారికి 100% వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని అన్నారు. వైద్య ఆరోగ్య సేవలపై ప్రతి వారం కలెక్టర్ ప్రత్యేకంగా వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో రివ్యూ నిర్వహించాలని అన్నారు
ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా అదనపు కలెక్టర్ ముజామిల్ ఖాన్, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం సిద్దిపేట జిల్లా వారిచే జారీ చేయడమైనది.

Share This Post