మన ఊరు మన బడి కార్యక్రమం లో భాగం గా చేపట్టిన అభివృద్ధి పనులు వేగవంతం కావాలని జిల్లా కలెక్టర్ గోపి అన్నారు

వరంగల్

మే 12

పనులు వేగవంతం కావాలి :: కలెక్టర్ గోపి

మన ఊరు మన బడి కార్యక్రమం లో భాగం గా చేపట్టిన అభివృద్ధి పనులు వేగవంతం కావాలని జిల్లా కలెక్టర్ గోపి అన్నారు

మన ఊరు మన బడి కి సంబందించిన పనుల పురోగతి పైన meo, స్పెషల్ అధికారులతో గురువారం కలెక్టర్ రివ్యూ తీసున్నారు

ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా లో మన ఊరు మన బడి కార్యక్రమం కింద ఎంపిక చేసిన 223 పాఠశాల లో చేయాలిసిన
అభివృద్ధి పనులకు సంబందించి పరిపాలన అనుమతులు పొందిన 95 పాఠశాల లలో పనులు త్వరగా గ్రౌండింగ్ కావాలన్నారు

ఈ నెల చివరి వరకు
ప్రతీ మండలానికి కనీసం రెండు పాఠశాలలో పనులు పూర్తి అవ్వాలన్నారు

అదనపు తరగతుల నిర్మాణాలకు సంబంధిత ఈ ఈ ల సర్టిఫికెషన్ తప్పనిసరి అని కలెక్టర్ తెలిపారు

మన ఊరు మన బడి కార్యక్రమం లో గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేస్తున్న పనులు త్వరగా పూర్తి అవ్వాలన్నారు

గ్రౌండింగ్ చేయబోయే పనుల ప్రారంభ కార్యక్రమనికి సంబంధిత మండల ప్రజాప్రతినిధులను, అధికారులను తప్పక ఆహ్వానించాలన్నారు

ఈ సమావేశం లో అదనపు కలెక్టర్ శ్రీ వత్సవా, deo వాసంతి, drdo పీడీ, meo లు, మండల స్పెషల్ అధికారులు, మండల నోడల్ అధికారులు పాల్గొన్నారు

Share This Post