మన ఊరు మన బడి కార్యక్రమాన్ని యజ్ఞంలా చేపట్టాలి

మన ఊరు మన బడి కార్యక్రమాన్ని యజ్ఞంలా చేపట్టాలి

పాఠశాలలు పునః ప్రారంభం అయ్యేనాటికి సిద్ధం చేయాలి

మే 10 వరకు పరిపాలన అనుమతులు 100% పూర్తి చేయాలి

రాష్ట్ర విద్యాశాఖ  మంత్రి  సబితా ఇంద్రా రెడ్డి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు

00000000

     మన ఊరు మన బడి కార్యక్రమాన్ని ఒక  యజ్ఞంలా చేపట్టి పాఠశాలలు పునః ప్రారంభం నాటికి యుద్ధ  ప్రాతిపదికన పూర్తి చేయాలని రాష్ట్ర విద్య శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆర్థిక శాఖ మంత్రి.తన్నీరు హరీష్ రావు జిల్లా కలెక్టర్లకు ఆదేశించారు.

      సోమవారం హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ తో మన ఊరు మన బడి కార్యక్రమoపై సమీక్షించారు.

     ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్దెందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందిస్తు కార్పోరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దేలా ప్రణాళికలను రూపొందించడం జరుగుతుందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి అన్నారు. మన ఊరు- మన బడి కార్యక్రమంలో మొదటి దశలో 9,123 పాఠశాలల్లో రూ.3497.62 కోట్లతో 12 రకాల మౌళిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత నిస్తున్నామని పేర్కోన్నారు.   రూ. 30 లక్షలలోపు పనులను పాఠశాల నిర్వహణా కమిటీలకు అప్పగించామని, రూ.30 లక్షల పైబడిన పనులను టెండర్ల ద్వారా చేపడుతున్నట్టు తెలిపారు.

     రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య  శాఖ మంత్రి టి. హరీష్ రావు మాట్లాడుతూ, మన ఊరు, మన ఊరి బడి కార్యక్రమానికి నిధుల కొరత లేదని, ఇప్పటికే అన్ని జిల్లాలకు ముందస్తుగా నిధులను విడుదల చేశామని అన్నారు. విద్యా యజ్ఞంగా చేపట్టిన మన ఊరు, మన బడి కార్యక్రమంలో మంజూరు చేసిన పనులన్నింటినీ సీనియర్ అధికారులతో తనికీ చేయించాలని కోరారు. పనుల ప్రారంభానికి ముందు పాఠశాల ఏవిధంగా వున్నాయి, పనుల తర్వాత ఏ విధంగా ఉన్నాయని ఫోటోలు తీయించాలని తెలిపారు. ప్రతీ మండలానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించి పనులను నాణ్యతతో, త్వరిత గతిన పూర్తయ్యేలా చూడాలని అన్నారు.

     రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మాట్లాడుతూ, రూ. 30 లక్షల లోపు పనులన్నింటికీ ఈ నెల 10వతేదీ లోపు పరిపాలన సంబంధిత అనుమతులను మంజూరి చేసి 15 నాటికి ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. రూ. 30 లక్షలకు పైబడ్డ పనులకు ఈనెలాఖరు వరకు టెండర్ల పక్రియను పూర్తి చేసి పనులను చేపట్టాలని ఆదేశించారు.

     ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ మాట్లాడుతూ, సాదారణ ప్రసవాలు ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులలో పెంచేందుకు ప్రణాళికలు రూపోందించడం జరిగిందని పేర్కోన్నారు.  మెడికల్ కళాశాల కొరకు 25 ఎకరాల భూమిని కేటాయించడం జరిగిందని తెలియజేశారు.

     ఈ వీడియో కాన్ఫరెన్స్ లో స్థానిక సంస్థల అధనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, జడ్పీ సిఈఓ ప్రియాంక, జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జువేరియా, జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రావు  డిఆర్డిఓ శ్రీలతా, జిల్లా మరియు హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రుల సూపరింటెండెంట్ లు రత్నమాల, రాజేందర్ రెడ్డి, సిపిఓ కొమురయ్య తదితరులు పాల్గోన్నారు.

Share This Post