మన ఊరు మన బడి కార్యక్రమ గ్రౌండింగ్ త్వరితగతిన చేపట్టాలి:: రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావువిద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

ప్రచురణార్థం—-2

తేదీ.2.5.2022

మన ఊరు మన బడి కార్యక్రమ గ్రౌండింగ్ త్వరితగతిన చేపట్టాలి:: రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావువిద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి*

జగిత్యాల మే 2:- జిల్లాలో మన ఊరు మన బడి మొదటి దశలో చేపట్టిన పాఠశాల పనుల గ్రౌండింగ్ త్వరితగతిన గతిన చేపట్టాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు & విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిసంబంధిత అధికారులను ఆదేశించారు. మన ఊరు మన బడి కార్యక్రమ అమలు పై సోమవారం విద్యా శాఖ మంత్రి, సీఎస్, ఉన్నత స్థాయి అధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్లు,మరో 2 జిల్లా ఉన్నతాధికారులు బృందంగా ఏర్పడి క్షేత్రస్థాయిలో పరిశీలించి అనుమతులు జారీ చేయాలని మంత్రి సూచించారు. ప్రస్తుత ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ఆధారంగా పనులు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని మంత్రి సూచించారు.

పాఠశాలలో చేపట్టాల్సిన డైనింగ్ హాల్ పనులకు కవర్ షెడ్డు తో ఏర్పాటు చేసెందుకు రూపోందించిన డిజైన్ వినియోగించాలని మంత్రి ఆదేశించారు. పాఠశాలలకు సెలవులు ఉన్న నేపథ్యంలో పనులు త్వరగా ప్రారంభించాలని ఆదేశించారు.

పాఠశాలలో మన ఊరు మనబడి కార్యక్రమం పనులకు శంకుస్థాపన చేసే సమయంలో గ్రామస్తులను, విద్యార్థుల తల్లిదండ్రులను భాగస్వామ్యం చేయాలని, ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన జరిగే అంశంపై వారికి వివరించాలని మంత్రి పేర్కొన్నారు. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను 2 భాషల్లో అందజేస్తామని తెలిపారు.

జిల్లాలో చేపడుతున్న పాఠశాల అభివృద్ధి పనుల ఫోటోలను నాడు-నేడు పేరుతో సామాజిక మాధ్యమాల్లో, న్యూస్ పేపర్లలో జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు విస్తృత ప్రచారం కల్పించాలని మంత్రి ఆదేశించారు.

మన ఊరు మన బడి కింద నిధులకు ఎలాంటి సమస్య లేదని , కలెక్టర్లకు అడ్వాన్స్ నిధులు అందజేశామని , త్వరితగతిన పనులను పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి పేర్కొన్నారు. ప్రతి నియోజక వర్గ పరిధిలో కనీసం 2 పాఠశాలలు పనులు మే మాసం చివరి వరకు పూర్తి చేయాలని ఆయన సూచించారు.

వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ మన ఊరు మన బడి కింద ఎంపికైన పాఠశాలల్లో చిన్న పనులను మే మాసం చివరి వరకు పూర్తి చేయాలని క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయించిందని మంత్రి తెలిపారు.

జిల్లాలో 30 లక్షల కంటే తక్కువ ప్రతిపాదనలు ఉన్న పాఠశాల పనులు వెంటనే పాఠశాల నిర్వహణ కమిటీతో గ్రౌండ్ చేయించాలని మంత్రి ఆదేశించారు.

మన ఊరు మన బడి కింద పాఠశాలలో ఫర్నిచర్, గ్రీన్ చాక్ బోర్డ్, పెయింటింగ్ డిజిటల్ క్లాస్ రూమ్ పనులు రాష్ట్రస్థాయిలో చేపడతామని, మిగిలిన అంశాలు జిల్లా స్థాయిలో పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.

ఇంటర్, 10వ తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని, ప్రశ్నాపత్రాల లీకేజీ వంటివి జరగకుండా అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశించారు

మే 10 నాటికి ప్రతి పాఠశాల ప్రతిపాదనలు తయారు చేసి, పరిపాలన అనుమతుల జారీ పూర్తి చేయాలని సీఎస్ కలెక్టర్ లను ఆదేశించారు.మన ఊరు మన బడి కార్యక్రమం కింద అనవసరపు ఖర్చులను నివారించేందుకు జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించాలని, 30 లక్షల లోపు ఉన్న పాఠశాల పనులను మే 15 నాటికి గ్రౌండ్ చేయాలని సీఎస్ ఆదేశించారు.

రూ.30 లక్షల కంటే అధికంగా ఉన్న పాఠశాల పనులకు షార్ట్ టెండర్లు పిలిచి పనులు మే చివరి నాటికి గ్రౌండ్ చేయాలని సూచించారు. జిల్లాలో అధిక ఖర్చుతో రుపోందించిన ప్రతిపాదనలు కలెక్టర్ మరోసారి పర్యవేక్షించాలని సీఎస్ ఆదేశించారు.

వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ జి.రవి మాట్లాడుతూ 274 పాఠశాలలు మొదటి విడత మన ఊరు మన బడి కింద చేపట్టామని, 137 పాఠశాలలకు సంబంధించి పరిపాలన అనుమతులు మంజూరు చేశామని కలెక్టర్ తెలిపారు. పాఠశాల ప్రతిపాదనలు రూపొందించి సమయంలో డైనింగ్ హాల్ ఏర్పాటు పాఠశాల విద్యార్థుల సంఖ్య ప్రకారం సాఫ్ట్వేర్ లో మార్పులు చేయాలని, 30 విద్యార్థులకు అదనపు తరగతి గదుల ఏర్పాటు సాఫ్ట్వేర్ లో చేర్చాలని కలెక్టర్ తెలిపారు. సాఫ్ట్వేర్ ప్రతినిధులు అవసరమైన చర్యలు తీసుకుంటారని మంత్రి తెలిపారు.

స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ , జిల్లా విద్యాశాఖ అధికారి జగన్మోహన్ రెడ్డి, ఈఈ పంచాయతీ రాజ్ సంబంధిత అధికారులు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు

జిల్లా పౌర సంబంధాల అధికారి జగిత్యాల చే జారీ చేయనైనది.

ప్రచురణార్థం----2  తేదీ.2.5.2022  మన ఊరు మన బడి కార్యక్రమ గ్రౌండింగ్ త్వరితగతిన చేపట్టాలి:: రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావువిద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి*  జగిత్యాల మే 2:-  జిల్లాలో మన ఊరు మన బడి మొదటి దశలో చేపట్టిన  పాఠశాల పనుల గ్రౌండింగ్ త్వరితగతిన గతిన చేపట్టాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు & విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిసంబంధిత అధికారులను ఆదేశించారు.  మన ఊరు మన బడి కార్యక్రమ అమలు పై సోమవారం  విద్యా శాఖ మంత్రి, సీఎస్, ఉన్నత స్థాయి అధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.   జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్లు,మరో 2 జిల్లా ఉన్నతాధికారులు బృందంగా ఏర్పడి క్షేత్రస్థాయిలో పరిశీలించి అనుమతులు జారీ చేయాలని మంత్రి సూచించారు. ప్రస్తుత ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ఆధారంగా పనులు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని  మంత్రి సూచించారు.    పాఠశాలలో చేపట్టాల్సిన డైనింగ్ హాల్ పనులకు కవర్ షెడ్డు తో ఏర్పాటు చేసెందుకు రూపోందించిన డిజైన్ వినియోగించాలని మంత్రి ఆదేశించారు. పాఠశాలలకు సెలవులు ఉన్న నేపథ్యంలో పనులు త్వరగా ప్రారంభించాలని ఆదేశించారు.     పాఠశాలలో మన ఊరు మనబడి కార్యక్రమం పనులకు శంకుస్థాపన చేసే  సమయంలో గ్రామస్తులను, విద్యార్థుల తల్లిదండ్రులను భాగస్వామ్యం చేయాలని, ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన జరిగే అంశంపై వారికి వివరించాలని మంత్రి పేర్కొన్నారు.  విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను 2 భాషల్లో అందజేస్తామని తెలిపారు.   జిల్లాలో చేపడుతున్న పాఠశాల అభివృద్ధి పనుల ఫోటోలను నాడు-నేడు పేరుతో సామాజిక మాధ్యమాల్లో, న్యూస్ పేపర్లలో జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు విస్తృత ప్రచారం కల్పించాలని మంత్రి ఆదేశించారు.  మన ఊరు మన బడి కింద నిధులకు ఎలాంటి సమస్య లేదని , కలెక్టర్లకు అడ్వాన్స్ నిధులు అందజేశామని , త్వరితగతిన పనులను పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి పేర్కొన్నారు.  ప్రతి నియోజక వర్గ పరిధిలో కనీసం 2 పాఠశాలలు పనులు మే మాసం చివరి వరకు పూర్తి చేయాలని ఆయన సూచించారు.  వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ మన ఊరు మన బడి కింద ఎంపికైన పాఠశాలల్లో చిన్న పనులను మే మాసం చివరి వరకు పూర్తి చేయాలని క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయించిందని మంత్రి తెలిపారు.   జిల్లాలో 30 లక్షల కంటే తక్కువ ప్రతిపాదనలు ఉన్న పాఠశాల పనులు వెంటనే పాఠశాల నిర్వహణ కమిటీతో గ్రౌండ్ చేయించాలని మంత్రి ఆదేశించారు.    మన ఊరు మన బడి కింద పాఠశాలలో ఫర్నిచర్, గ్రీన్ చాక్ బోర్డ్, పెయింటింగ్ డిజిటల్ క్లాస్ రూమ్ పనులు రాష్ట్రస్థాయిలో చేపడతామని, మిగిలిన అంశాలు జిల్లా స్థాయిలో పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.   ఇంటర్, 10వ తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని, ప్రశ్నాపత్రాల లీకేజీ వంటివి జరగకుండా అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశించారు  మే 10 నాటికి ప్రతి పాఠశాల ప్రతిపాదనలు తయారు చేసి, పరిపాలన అనుమతుల జారీ పూర్తి చేయాలని సీఎస్ కలెక్టర్ లను ఆదేశించారు.మన ఊరు మన బడి కార్యక్రమం కింద అనవసరపు ఖర్చులను నివారించేందుకు జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించాలని, 30 లక్షల లోపు ఉన్న పాఠశాల పనులను మే 15 నాటికి గ్రౌండ్ చేయాలని సీఎస్ ఆదేశించారు.  రూ.30 లక్షల కంటే అధికంగా ఉన్న పాఠశాల పనులకు షార్ట్ టెండర్లు పిలిచి పనులు మే చివరి నాటికి గ్రౌండ్ చేయాలని సూచించారు.  జిల్లాలో అధిక ఖర్చుతో రుపోందించిన ప్రతిపాదనలు కలెక్టర్ మరోసారి పర్యవేక్షించాలని సీఎస్ ఆదేశించారు.  వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ జి.రవి మాట్లాడుతూ   274 పాఠశాలలు మొదటి విడత మన ఊరు మన బడి కింద చేపట్టామని, 137 పాఠశాలలకు సంబంధించి పరిపాలన అనుమతులు మంజూరు చేశామని కలెక్టర్ తెలిపారు. పాఠశాల ప్రతిపాదనలు రూపొందించి సమయంలో డైనింగ్ హాల్ ఏర్పాటు పాఠశాల విద్యార్థుల సంఖ్య ప్రకారం సాఫ్ట్వేర్ లో మార్పులు చేయాలని, 30 విద్యార్థులకు అదనపు తరగతి గదుల ఏర్పాటు సాఫ్ట్వేర్ లో చేర్చాలని కలెక్టర్ తెలిపారు. సాఫ్ట్వేర్ ప్రతినిధులు  అవసరమైన చర్యలు తీసుకుంటారని మంత్రి తెలిపారు.   స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ , జిల్లా విద్యాశాఖ అధికారి జగన్మోహన్ రెడ్డి, ఈఈ పంచాయతీ రాజ్  సంబంధిత అధికారులు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు  జిల్లా పౌర సంబంధాల అధికారి జగిత్యాల చే జారీ చేయనైనది.
మన ఊరు మన బడి కార్యక్రమ గ్రౌండింగ్ త్వరితగతిన చేపట్టాలి:: రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావువిద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

Share This Post