మన ఊరు మన బడి కింద మంజూరు అయిన పాఠశాలల మరమ్మతు పనులను వేగవంతం చేయాలని, పర్యవేక్షణలో నిర్లక్ష్యం చేస్తే సహాయ ఇంజనీర్లు, మండల విద్యాధికారుల పై చర్యలు తప్పవని -అదనపు కలెక్టర్ -మను చౌదరి

పత్రిక ప్రకటన
తేది: 28-9-2022
నాగర్ కర్నూల్ జిల్లా
మన ఊరు మన బడి కింద మంజూరు అయిన పాఠశాలల మరమ్మతు పనులను వేగవంతం చేయాలని, పర్యవేక్షణలో నిర్లక్ష్యం చేస్తే సహాయ ఇంజనీర్లు, మండల విద్యాధికారుల పై చర్యలు తప్పవని అదనపు కలెక్టర్ మను చౌదరి ఆదేశించారు. బుధవారం ఉదయం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇంజనీరింగ్, విద్యా శాఖ అధికారులతో మన ఊరు మన బడి కార్యక్రమం పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన ఒక్కో మండలంలోని ఒక్కో పాఠశాలలో ఇప్పటి వరకు జరిగిన పనులు, ఆలస్యానికి గల కారణాల పై సమీక్ష నిర్వహించారు. మన ఊరు మన బడి కింది ఎంపిక చేసిన దాదాపు అన్ని పాఠశాలలకు మరమ్మతు పనులు చేపట్టడానికి ముందస్తుగా 5 నుండి 15 శాతం వరకు రివాల్వింగ్ ఫండ్ గా నిధులు విడుదల చేసినప్పటికిని ఆ స్థాయిలో సైతం పనులు పూర్తి చేయకపోవడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రివాల్వింగ్ ఫండ్ ఇచ్చామని, సిమెంట్ సైతం నాలుగు నియోజకవర్గాల్లో పుష్కలంగా ఉన్నప్పటికిని పనులు చేయడానికి తీసుకువెళ్లడం లేదు ఎందుకని ఏ.ఈ లు, యం.ఈ.ఓ లను ప్రశ్నించారు. జిల్లాలోని 4 డివిజన్లలో సిమెంట్ నిల్వలు ఉన్నాయని ఇంతకు ముందు సిమెంట్ కొరకు ఇండెంట్ పెట్టినదానికి సంబంధం లేకుండా ఏ పాఠశాలకైతే అవసరం ఉందొ రికార్డులో నమోదు చేయించి తీసుకెళ్లాలని ఆదేశించారు. ప్రస్తుతం నిల్వ ఉన్న సిమెంట్ బస్తాలు ఖాళీ అయితే ఇంకా 11 వేల బస్తాలు వెంటనే వస్తాయని తెలిపారు. ఎక్కడైతే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ద్వారా పనులు నిర్వహిస్తూ ఆలస్యం అవుతున్న చోట మండల వైద్యాధికారి బాధ్యత వహించాల్సి ఉంటుందని, సర్పంచులు, కాంట్రాక్టర్లు పనులు చేయిస్తున్న చోట ఏ.ఈ. లు బాధ్యత వహించాలని తెలిపారు. ఇప్పటి వరకు పనులు పూర్తి చేసి ఎఫ్.టి.ఓ లు అప్లోడ్ చేసిన వాటికి బిల్లులు పేమెంట్ అయ్యాయని ఎక్కడ పెండింగ్ లేదన్నారు. చేసిన పనికి వెనువెంటనే ఎఫ్.టి.ఓ లు జనరేట్ చేసి అప్లోడ్ చెయాల్సిందిగా సూచించారు. కొల్లాపూర్ నుండి ఇప్పటి వరకు ఒక్క ఎఫ్.టి.ఓ అప్లోడ్ కాకపోవడం పై ఆదనవు కలెక్టర్ డి.ఈ., మండల వైద్యాధికారి పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరికి షోకాజ్ నోటీసులు జారీ చెయాల్సిందిగా ఆదేశించారు. ఇక నుండి పర్యవేక్షణ లోపం ఉండి పనులు చేయించుకుండా నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఈ సమావేశంలో జిల్లా విద్యాధికారి గోవిందరాజులు, ఇఇ ఆర్.అండ్ బి భాస్కర్, ఇఇ పంచాయతి రాజ్ దామోదర్ రావు, డి.ఈ లు, ఏ.ఈ లు, ఎం.ఈ.ఓ లు తదితరులు పాల్గొన్నారు.
——————
జిల్లా పౌర సంబంధాల అధికారి, నాగర్ కర్నూల్ ద్వారా జారీ.

Share This Post