మన ఊరు మన బడి ద్వారా పాఠశాలలకు కావలసిన మౌళిక వసతులు కల్పించాలి ….. జిల్లా కలెక్టర్ కె. శశాంక

మన ఊరు మన బడి ద్వారా పాఠశాలలకు కావలసిన మౌళిక వసతులు కల్పించాలి ….. జిల్లా కలెక్టర్ కె. శశాంక

ప్రచురణార్థం

మన ఊరు మన బడి ద్వారా పాఠశాలలకు కావలసిన మౌళిక వసతులు కల్పించాలి ….. జిల్లా కలెక్టర్ కె. శశాంక

మహబూబాబాద్, మే -11:

మన ఊరు మన బడి కార్యక్రమం ద్వారా పాఠశాలలకు కావాల్సిన మౌళిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. శశాంక అధికారులను ఆదేశించారు.

బుధవారం జిల్లా కలెక్టర్ కె. శశాంక మరిపెడ మండల కేంద్రంలో జిల్లా పరిషత్ సెకండరీ స్కూల్, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలల్లో మన ఊరు మన బడిలో చేపట్టవలసిన పనులను సంబంధిత పాఠశాలలకు వెళ్లి పరిశీలించారు.

జిల్లా కలెక్టర్ ముందుగా జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలను పరిశీలించారు. పాఠశాలలో ఉన్న విద్యార్ధుల సంఖ్యను బట్టి ప్రస్తుతం ఉన్న గదులు సరిపోతాయని, అదనపు గదుల నిర్మాణం అవసరం లేదని తెలిపారు. విశాలమైన గదులను తరగతి గదులుగా మార్చాలని, ఉన్న గదులకు మరమత్తులు చేపట్టాలని, డోర్స్, కిటికీలు ఏర్పాటు చేయాలని, ఉన్న గదులలో అవసరం మేరకు ఫ్లోరింగ్, రూఫ్ పనులను చేపట్టాలని, టాయ్లెట్ లు సరిపోయిన విధంగా ఉన్నాయని, బాలికలకు టాయ్లెట్ దగ్గరగా నిర్మించాలని తెలిపారు. కిచెన్ షెడ్ కు కొంత మేర సైడ్ వాల్ ఏర్పాటు చేయాలన్నారు. నిరుపయోగంగా ఉన్న గదులను మరమ్మతు చేసుకొని డైనింగ్ హాల్ గా వాడే విధంగా ఏర్పాటు చేయలని తెలిపారు.పాఠశాలకు ఉన్న ప్రహరీ ఎత్తు పెంచి లోపలికి బయటి వ్యక్తులు రాకుండా అదనంగా 2 ఫీట్ ల ఎత్తులో గ్రిల్ ఏర్పాటు చేయాలని తెలిపారు.

అనంతరం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు. ముఖ్యంగా పాఠశాలకు సంబంధించి హద్దులను గుర్తించి, కాంపౌండ్ వాల్ కట్టవలసిన అవసరం ఉందని, కిచెన్ షెడ్ ఏర్పాటు చేయాలని, పిల్లల సంఖ్యను బట్టి ఉన్న తరగతి గదులు సరిపోతాయని, పిల్లల సంఖ్యను పెంచాలని హెచ్.ఎం.కు తెలిపారు.

ఈ కార్యక్రమంలో తహశీల్దార్ రాం ప్రసాద్, ఎంపిడిఓ ధన్ సింఘ్, స్పెషల్ ఆఫీసర్ టి. సుధాకర్, మునిసిపల్ కమిషనర్ సత్యనారాయణ రెడ్డి, హెచ్.ఎం. బి. రఘుజి, హరి, ఏ. ఈ. శివ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

——————————————————-
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, మహబూబాబాద్ చే జారీ చేయనైనది.

Share This Post