మన ఊరు మన బడి పనులు గ్రౌండింగ్ పై ప్రత్యేక దృష్టి::జిల్లా కలెక్టర్ జి.రవి

ప్రచురణార్థం—1

ప్రచురణార్థం---1  మన ఊరు మన బడి పనులు గ్రౌండింగ్ పై ప్రత్యేక దృష్టి::జిల్లా కలెక్టర్ జి.రవి  జగిత్యాల ఏప్రిల్ 26:-  జిల్లాలో మన ఊరు మనబడి కార్యక్రమం కింద పాఠశాలలో పనుల గ్రౌండింగ్ పై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ జి రవి సంబంధిత అధికారులను ఆదేశించారు.  మన ఊరు మన బడి కార్యక్రమాల అమలు తీరుపై కలెక్టర్ మంగళవారం సంబంధిత అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా రివ్యూ నిర్వహించారు.   జిల్లాలో మొదటి దశలో 274 పాఠశాలల్లో మన ఊరు మనబడి కింద ఎంపిక చేయగా ఇప్పటివరకు 267 పాఠశాలల  ఇన్ ఫుట్  డాటా ఎంట్రీ,258 పాఠశాలలో లీడ్ స్టేట్మెంట్, 200 పాఠశాలల ప్రతిపాదనలు పూర్తయ్యాయని కలెక్టర్ పేర్కొన్నారు.    గొల్లపల్లి ,కోరుట్ల , మల్లాపూర్ మండలాల్లో 2 ఇన్ ఫుట్  డాటా ఎంట్రీ,  మేడిపల్లి మండలంలో 6 పాఠశాలల లీడ్ స్టేట్మెంట్ పెండింగ్  ఉండటానికి గల కారణాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.  త్వరితగతిన పాఠశాలలో కొలతలు తీసుకుని    ఇన్ ఫుట్  డాటా ఎంట్రీ పూర్తిచేయాలని కలెక్టర్ ఆదేశించారు   మేడిపల్లి మండలంలో లో ప్రధాన రహదారికి పక్కనే పాఠశాల ఉన్నందున, ఇతర ప్రాంతాలకు తరలించేందుకు దరఖాస్తులు వస్తున్నాయని, దీనిపై విద్యాశాఖ తమ అభిప్రాయం తెలియ చేయాలని కలెక్టర్ ఆదేశించారు.       జిల్లాలో 267 పాఠశాలలో   ఇన్ ఫుట్  డాటా ఎంట్రీ పూర్తి చేసినప్పటికీ 200 పాఠశాలల్లో  మాత్రమే ప్రతిపాదనలు పూర్తి చేయడానికి గల కారణాలపై కలెక్టర్ చర్చించారు, త్వరితగతిన పెండింగ్ పాఠశాల ప్రతిపాదనలు సైతం పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.  జిల్లాలో 155 పాఠశాలల అభివృద్ధి ప్రాజెక్ట్ తయారు చేశామని   వాటిలో 116 ప్రాజెక్టులకు పరిపాలన అనుమతులు, 99 పాఠశాలలకు సాంకేతిక అనుమతులు  మంజూరు చేశామని కలెక్టర్ తెలిపారు.  రూ.30 లక్షల కంటే అధికంగా ఉన్న పాఠశాల అభివృద్ధి పనుల సాంకేతిక అనుమతులు జారీ అవకాశం ఈఈ లాగిన్లో లేదని, ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ సాంకేతిక నిపుణులు సూచించారు.   జిల్లాలో 91 ప్రాజెక్టులకు ఎంఓయు జనరేట్ చేశామని, 53 ప్రాజెక్టుల ఎంఒయూ పై సంతకాలు పూర్తిచేశామని ,5 ప్రాజెక్టుల ఎంఓయు తీర్మానాలు చేశామని కలెక్టర్ పేర్కొన్నారు.   జిల్లాలో పరిపాలన అనుమతులు మంజూరు చేసిన ప్రతి పాఠశాల ఎంఓయూ జనరేట్ చేసి, సంబంధిత   అధికారుల, పంచాయతీలో తీర్మానం పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. ఎం ఓ యు జనరేషన్ ,సంతకం తీర్మానం, తదితర అంశాలపై మండల విద్యాశాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లా ఇంచార్జ్ మంత్రి గారి ఆమోదం పొందిన తర్వాత పనులను త్వరితగతిన గ్రౌండ్ చేయాలని, పాఠశాల పనుల గ్రౌండింగ్ పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ సూచించారు.  మన ఊరు మన బడి కార్యక్రమం అమలుపై జిల్లా విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించాలని, ఎప్పటికప్పుడు పనులు వేగవంతం అయ్యే దిశగా ఇతర శాఖల అధికారులతో కోఆర్డినేట్ చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు.  జిల్లా విద్యాశాఖ అధికారి  ఇంజనీర్లు సంబంధిత అధికారులు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు  జిల్లా పౌరసంబంధాల అధికారి జగిత్యాల జారీ చేయనైనది.
మన ఊరు మన బడి పనులు గ్రౌండింగ్ పై ప్రత్యేక దృష్టి::జిల్లా కలెక్టర్ జి.రవి

జగిత్యాల ఏప్రిల్ 26:- జిల్లాలో మన ఊరు మనబడి కార్యక్రమం కింద పాఠశాలలో పనుల గ్రౌండింగ్ పై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ జి రవి సంబంధిత అధికారులను ఆదేశించారు.

మన ఊరు మన బడి కార్యక్రమాల అమలు తీరుపై కలెక్టర్ మంగళవారం సంబంధిత అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా రివ్యూ నిర్వహించారు.

జిల్లాలో మొదటి దశలో 274 పాఠశాలల్లో మన ఊరు మనబడి కింద ఎంపిక చేయగా ఇప్పటివరకు 267 పాఠశాలల ఇన్ ఫుట్ డాటా ఎంట్రీ,258 పాఠశాలలో లీడ్ స్టేట్మెంట్, 200 పాఠశాలల ప్రతిపాదనలు పూర్తయ్యాయని కలెక్టర్ పేర్కొన్నారు.

గొల్లపల్లి ,కోరుట్ల , మల్లాపూర్ మండలాల్లో 2 ఇన్ ఫుట్ డాటా ఎంట్రీ, మేడిపల్లి మండలంలో 6 పాఠశాలల లీడ్ స్టేట్మెంట్ పెండింగ్ ఉండటానికి గల కారణాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. త్వరితగతిన పాఠశాలలో కొలతలు తీసుకుని ఇన్ ఫుట్ డాటా ఎంట్రీ పూర్తిచేయాలని కలెక్టర్ ఆదేశించారు మేడిపల్లి మండలంలో లో ప్రధాన రహదారికి పక్కనే పాఠశాల ఉన్నందున, ఇతర ప్రాంతాలకు తరలించేందుకు దరఖాస్తులు వస్తున్నాయని, దీనిపై విద్యాశాఖ తమ అభిప్రాయం తెలియ చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

 

జిల్లాలో 267 పాఠశాలలో ఇన్ ఫుట్ డాటా ఎంట్రీ పూర్తి చేసినప్పటికీ 200 పాఠశాలల్లో మాత్రమే ప్రతిపాదనలు పూర్తి చేయడానికి గల కారణాలపై కలెక్టర్ చర్చించారు, త్వరితగతిన పెండింగ్ పాఠశాల ప్రతిపాదనలు సైతం పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.

జిల్లాలో 155 పాఠశాలల అభివృద్ధి ప్రాజెక్ట్ తయారు చేశామని వాటిలో 116 ప్రాజెక్టులకు పరిపాలన అనుమతులు, 99 పాఠశాలలకు సాంకేతిక అనుమతులు మంజూరు చేశామని కలెక్టర్ తెలిపారు.

రూ.30 లక్షల కంటే అధికంగా ఉన్న పాఠశాల అభివృద్ధి పనుల సాంకేతిక అనుమతులు జారీ అవకాశం ఈఈ లాగిన్లో లేదని, ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ సాంకేతిక నిపుణులు సూచించారు.

జిల్లాలో 91 ప్రాజెక్టులకు ఎంఓయు జనరేట్ చేశామని, 53 ప్రాజెక్టుల ఎంఒయూ పై సంతకాలు పూర్తిచేశామని ,5 ప్రాజెక్టుల ఎంఓయు తీర్మానాలు చేశామని కలెక్టర్ పేర్కొన్నారు.

జిల్లాలో పరిపాలన అనుమతులు మంజూరు చేసిన ప్రతి పాఠశాల ఎంఓయూ జనరేట్ చేసి, సంబంధిత అధికారుల, పంచాయతీలో తీర్మానం పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు.
ఎం ఓ యు జనరేషన్ ,సంతకం తీర్మానం, తదితర అంశాలపై మండల విద్యాశాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లా ఇంచార్జ్ మంత్రి గారి ఆమోదం పొందిన తర్వాత పనులను త్వరితగతిన గ్రౌండ్ చేయాలని, పాఠశాల పనుల గ్రౌండింగ్ పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ సూచించారు.

మన ఊరు మన బడి కార్యక్రమం అమలుపై జిల్లా విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించాలని, ఎప్పటికప్పుడు పనులు వేగవంతం అయ్యే దిశగా ఇతర శాఖల అధికారులతో కోఆర్డినేట్ చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు.

జిల్లా విద్యాశాఖ అధికారి ఇంజనీర్లు సంబంధిత అధికారులు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు

జిల్లా పౌరసంబంధాల అధికారి జగిత్యాల జారీ చేయనైనది.

Share This Post