మన ఊరు మన బడి పనులు త్వరగా పూర్తి చేయాలి ఎమ్మెల్లె పట్నం నరేందర్ రెడ్డి

పత్రిక ప్రకటన
నారాయణపేట జిల్లా
తేది: 25-03-2023
మన ఊరు మన బడి పనులు త్వరగా పూర్తి చేయాలి ఎమ్మెల్లె పట్నం నరేందర్ రెడ్డి
శనివారం ఉదయం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో మద్దూర్ మండల గ్రామ సర్పంచ్, అధికారులతో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష, కొడంగల్ ఎమ్మెల్లే పట్నం నరేందర్ రెడ్డి తో కలిసి మన ఊరు మన బడి పనుల పై సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠత్మకంగా చేపట్టిన మన ఊరు మన బడి పనులను త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్లె పట్నం నరేందర్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రయివేటు స్కూల్ లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉండాలనే ఉద్యేశం తో పాఠశాల లను అన్ని హంగులతో నిర్మించాలనే ఉద్యేశం తో ఉన్నారన్నారు. మద్దూర్ మండలం లో మొత్తం 28 పాఠశాల లను ఎంపిక చేయాడం జరిగిందని అన్ని పాఠశాలలు ప్రారంభోత్సహానికి సిద్ధంగా ఉన్నాయన్ని కొన్ని చోట్ల ప్రహరీ గోడల నిర్మాణం, మరుగుదొడ్ల ఏర్పాట్లు మరియు కిచన్ షెడ్ల నిర్మాణ పనులలో జాప్యం వహించడం తో పనులు అసంపూర్తిగా ఉన్నాయని వాటిని వెంటనే పూర్తిచేయలన్నారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్న కలెక్టర్ గారికి లేదా నా దృష్టి కి తీసుకోరవలన్నారు. ఏప్రిల్ చివరి వరకు అన్ని పాఠశాలలు ప్రారంభం చేసుకొనెటట్లుతగు చర్యలు చేపట్టాలన్నారు.
కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ ప్రారంభోత్సహానికి సిద్ధంగా ఉన్నవాటి లో ఫర్నిచర్ ను తరలించాడం జరుగుతోందని, జిల్లా లో ఇసుక కొరత లేదని ఇప్పటికే పనులు పూర్తి అయిన వాటికి డబ్బులను అందించడం జరిగిందని మన ఊరు మన బడి పనులలో జాప్యం వహించవద్దన్నారు. NREGS కులిల డబ్బులు కూడా చెల్లించడం జరిగిందన్నారు. ఇంక కొన్ని చోట్ల పనులను ప్రారంభించలేదాన్ని వాటిని వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు.
ఈ సమావేశం జిల్లా అధికారులు నరేందర్, రాములు, మురళి కోస్గి జెడ్పిటిసి ప్రకాష్ రెడ్డి, సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు.

………………………………………………
జిల్లా పౌర సంభందాల అధికారి ద్వార జారి.

Share This Post