ప్రచురణార్థం—4
తేదీ.6.5.2022
మన ఊరు మన బడి పనుల్లో వేగం పెంచాలి::జిల్లా కలెక్టర్ జి.రవి
జగిత్యాల మే 06:- జిల్లాలో మన ఊరు మనబడి కార్యక్రమం కింద పాఠశాలలో పనుల గ్రౌండింగ్ పై ప్రత్యేక దృష్టి సారించి పనుల్లో వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ జి రవి సంబంధిత అధికారులను ఆదేశించారు.మన ఊరు మన బడి కార్యక్రమాల అమలు తీరుపై కలెక్టర్ శుక్రవారం కలెక్టర్ కార్యాలయం నుండి సంబంధిత అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా రివ్యూ నిర్వహించారు.
జిల్లాలో మొదటి దశలో 274 పాఠశాలల్లో మన ఊరు మనబడి కింద ఎంపిక చేయగా ఇప్పటివరకు 268 పాఠశాలల ఇన్ ఫుట్ డాటా ఎంట్రీ,270 పాఠశాలలో లీడ్ స్టేట్మెంట్, 256 పాఠశాలల ప్రతిపాదనలు పూర్తయ్యాయని, 895 పనులు ఎస్టీమషన్ పూర్తి అయ్యాయాని కలెక్టర్ పేర్కొన్నారు.
త్వరితగతిన పాఠశాలలో కొలతలు తీసుకుని ఇన్ ఫుట్ డాటా ఎంట్రీ పూర్తిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. తోరగా ప్రతిపాదనలు పూర్తి చేయడానికి గల కారణాలపై కలెక్టర్ చర్చించారు, త్వరితగతిన పెండింగ్ పాఠశాల ప్రతిపాదనలు సైతం పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.
జిల్లాలో 193 పాఠశాలల అభివృద్ధి ప్రాజెక్ట్ తయారు చేశామని వాటిలో 137 ప్రాజెక్టులకు పరిపాలన అనుమతులు, 122 పాఠశాలలకు సాంకేతిక అనుమతులు మంజూరు చేశామని కలెక్టర్ తెలిపారు.రూ.30 లక్షల కంటే అధికంగా ఉన్న పాఠశాల అభివృద్ధి పనుల సాంకేతిక అనుమతులు జారీ అవకాశం ఈఈ లాగిన్లో లేదని, ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ సాంకేతిక నిపుణులు సూచించారు.
జిల్లాలో 105 ప్రాజెక్టులకు ఎంఓయు జనరేట్ చేశామని, 98 ప్రాజెక్టుల ఎంఒయూ పై సంతకాలు పూర్తిచేశామని ,42 ప్రాజెక్టుల ఎంఓయు తీర్మానాలు చేశామని కలెక్టర్ పేర్కొన్నారు.
జిల్లాలో పరిపాలన అనుమతులు మంజూరు చేసిన ప్రతి పాఠశాల ఎంఓయూ జనరేట్ చేసి, సంబంధిత అధికారుల, పంచాయతీలో తీర్మానం పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు.
ఎం ఓ యు జనరేషన్ ,సంతకం తీర్మానం, తదితర అంశాలపై మండల విద్యాశాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ ఆదేశించారు. 25 స్కూల్లో పూర్తి అయిన పనులు జిల్లా ఇంచార్జ్ మంత్రి గారి సమయం తీసుకొని వెంటనే ప్రారంభిచుకోవాలని కలెక్టర్ తెలియచేశారు.
మన ఊరు మన బడి కార్యక్రమం అమలుపై జిల్లా విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించాలని, ఎప్పటికప్పుడు పనులు వేగవంతం అయ్యే దిశగా ఇతర శాఖల అధికారులతో కోఆర్డినేట్ చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు.
అదనపు కలెక్టర్ శ్రీమతి బి.ఎస్.లత, జిల్లా విద్యాశాఖ అధికారి , ఇంజనీర్లు, మండల ప్రత్యేక అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
జిల్లా పౌరసంబంధాల అధికారి జగిత్యాల చే జారీ చేయనైనది.
