మన ఊరు మన బడి పాఠశాలల పనులకు అవసరం మేరకు ఇసుకను అందించాలి …. జిల్లా కలెక్టర్ కె. శశాంక.

మన ఊరు మన బడి పాఠశాలల పనులకు అవసరం మేరకు ఇసుకను అందించాలి …. జిల్లా కలెక్టర్ కె. శశాంక.

ప్రచురణార్థం

మన ఊరు మన బడి పాఠశాలల పనులకు అవసరం మేరకు ఇసుకను అందించాలి …. జిల్లా కలెక్టర్ కె. శశాంక.

మహబూబాబాద్, జూన్ -06:

మన ఊరు మన బడి, డబుల్ బెడ్ రూం లకు అవసరం మేరకు ఇసుకను అందించాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ కె. శశాంక ఆదేశించారు.

సోమవారం ప్రజ్ఞా సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ కె. శశాంక ఇసుక రవాణా విధి విధానాలపై ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, మన ఊరు మన బడికి సంబంధించి ఎస్.ఎం.సి పేరున, ఎన్.ఆర్. ఈ.జి.ఎస్. ద్వారా చేపట్టిన పనులకు సంబంధించి సర్పంచ్ పేరున ఇసుకను జారీ చేసే విధిగా చర్యలు తీసుకోవాలని, ఏజెన్సీ పేరునే ఇసుకను జారీ చేయాలని, ఏ ప్రాంతం వారు ఏ ఇసుక రీచ్ ల నుండి ఇసుకను పొందాలి అనే విషయమై వివరించారు. అలాగే డబుల్ బెడ్ రూం కట్టడాల విషయమై ఇసుకను అవసరం మేరకు అందించాలని తెలిపారు. డివిజన్ వారీగా ఇసుక లభ్యతను, రానున్న వర్షాకాలం దృష్ట్యా తగ్గనున్న ఇసుక రీచ్ ల వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్, ఆర్డీవో లు కొమురయ్య, రమేష్, ఏ.డి. మైన్స్ రఘు నందన్ రెడ్డి, డి.పి. ఓ సాయి బాబా, ఇరిగేషన్, ఈ. ఈ. ఎం. వెంకటేశ్వర్లు, పి.ఆర్. ఈ. ఈ. సురేష్, ఆర్ అండ్ బి ఈ.ఈ. తానేశ్వర్, గ్రౌండ్ వాటర్ డి.డి. వి.సురేష్, టి.ఎస్. ఈ.డబ్ల్యూ. ఐ.డి.సి. ఈ. ఈ.జే..నరేందర్ రెడ్డి, మునిసిపల్ డి. ఈ., కలెక్టరేట్ సెక్షన్ సూపరింటెండెంట్ పుల్లా రావు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post